వీళ్లు వరకట్న పిశాచిని తరిమేస్తున్నారు

dowryవరకట్నానికి వ్యతిరేకంగా యువత ఒక్కటవుతుంది. కట్నం తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా నేరమంటోంది. ఇద్దరు కలిసి బ్రతకడానికి.. కట్నమెందుకుని ప్రశ్నిస్తోంది. కట్నం ఇవ్వం.. తీసుకోమంటూ ఏకంగా ఓ వెబ్ సైట్ నే లాంచ్ చేసింది.

దేశంలో వరకట్నం వేధింపులతో అనేక మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. మరికొన్ని పెళ్లిళ్లు పీటల వరకు కూడా వెళ్లకుండానే ఆగిపోతున్నాయి. అలాంటి వరకట్న పిశాచిని తరిమేయాలంటూ కొందరు యువతీయువకులు ముందుకొచ్చారు. ‘ఐ డోంట్ వాంట్ డౌరీ’ అనే సైట్ ను లాంచ్ చేశారు. కట్నం తీసుకోం.. ఇవ్వమనే యువతీయువకులు ఈ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్నారు.

కట్నం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా.. ఇవ్వమని తేల్చిచెబుతున్నారు. మూడు ముళ్లతో ఒకటవ్వడానికి పైకమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. చేతకానివాడు, బతకలేనివాడే కట్నం తీసుకుంటారంటున్నారు. ‘ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కాం’ ఏర్పాటు చేసిన స్వయంవరంలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

idont want dowryవరకట్నంపై పిల్లల నిర్ణయానికి పేరెంట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. కట్నం తీసుకోం.. ఇవ్వమంటున్నారు. రెండు మనసులతో కలిసి బంధానికి.. డబ్బుతో ముడిపెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ వెబ్ సైట్ లాంచ్ చేసి 9 ఏళ్లు అవుతుందన్నారు సైట్ నిర్వాహకులు. ఇప్పటి వరకు 16వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఈ సైట్ తో 37 పెళ్లిళ్లే జరిగాయిని.. కొంత మంది వెబ్ సైట్ లో చెప్పకుండానే మ్యారేజ్ చేసుకున్నారంటున్నారు. ఈ వెబ్ సైట్ లో వరకట్నానికి వ్యతిరేకంగా అబ్బాయిలే ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కట్నం ఇవ్వమని అమ్మాయిలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు నిర్వాహకులు. వరకట్నానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో… యువత ముందుకురావాలని కోరుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy