పెళ్లికి తొందరేమి లేదట..!!

bride

ముందు వరుసలో ఉన్న అమ్మాయిలు

పెళ్లా.. అప్పుడేనా.. ఏమంత వయసైంది. సిటీలో పెళ్లి గురించి యూత్ ని కదిలిస్తే ఇదే మాట చెబుతున్నారు. వాళ్లడిగే క్వశ్చన్లకి ఆన్సర్లివ్వాలంటే.. అడిగినోళ్లకి మైండ్ చెడిపోవాల్సిందే. పెళ్లి గురించి వీళ్లనెందుకు అడిగాంరా బాబూ అనుకోవాలి. ఒక్కరూ ఇద్దరూ కాదు. బోలెడు మంది ఇదే మాట చెబుతున్నారు. పైటేయగానే పెళ్లి చేసుకునే రోజులు జమానా కాలం నాటి పద్దతి. ఇప్పుడలా కాదు. బండి కొనాలి. బంగారం కొనాలి. కార్ కొనాలి. ఇళ్లు కొనాలి. అట్ లీస్ట్ సొంతంగా బతికే కెపాసిటీ కావాలి. ఇదే మాట చెబుతున్నారు అమ్మాయిలు. పెళ్లీడుకి నెంబర్ ఫిక్స్ చేయడాన్ని ఏమాత్రం ఒప్పేసుకోవడం లేదు. దానికి సవాలక్ష ఈక్వేషన్స్ చెబుతున్నారు. మేథమేటిక్స్ ని సైన్స్ ని మిక్స్ చేసి… సోషల్ స్టేషన్ ని కలిపేసి.. కంగారు పడొద్దని పేరెంట్స్ కి.. బంధువులకి క్లారిటీ ఇచ్చేస్తున్నారు అమ్మాయిలు.

ఇక మైనర్ ఏజ్ లో మేరేజ్ గురించి మాట్లాడితే.. అమ్మాయిలు చూసే సిరాకు చూపుకి బద్నామ్ కావాల్సిందే ఎవరైనా. పెళ్లికి కనీసం 26.. 27 ఏళ్లు ఉండాలి. అప్పటికీ అన్నిరకాలుగా సెట్ అయితేనే.. లేదంటే చూద్దాంలే అని సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఈలోగా జాబ్ లు గట్రా వచ్చేస్తే.. హయ్యర్ పొజిషన్ కి ఎదగాలని ఎయిమ్స్ కామనే. అలా అలా వాయిదా వేసేస్తున్నారు. ముహూర్తాలు బావున్నయ్ కదా అని.. మంచి సంబంధం మిస్ అవుతుందని కానీ పెళ్లి మాటెత్తడం సరికాదంటున్నారు. మేగ్జిమమ్ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. 24 వరకు ఎలాగూ చదువులుంటున్నయ్. తర్వాత జాబ్ సర్చింగ్. లేదంటే బిజినెస్ ప్లానింగ్. తర్వాత దాంతో బిజీ. ఇక షాపింగ్ లు.. పార్టీలు.. ఎన్ని లేవు. ఇలా బిజీ బిజీగా గడిపేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చినట్లు ఉండేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. పెళ్లి చేసుకోకపోవడానికి పేరెంట్స్ కి రీజన్ చెబుతూ.. కన్విన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా జాబ్. మెచ్యూరిటీ. సోషల్ స్టేటస్. సొంతంగా బతికే కెపాసిటీ. మంచి రిలేషన్. ఇలా అన్నీ కేలుక్యులేట్ చేస్తున్నారు అమ్మాయిలు. అందంలోనే కాదు.. లైఫ్ ని ప్లాన్ చేసుకోవడంలో తామేం తక్కువ కాదంటున్నారు. మేరేజ్ పేరుతో లాకై పోయి.. తర్వాత బాధ పడితే ఏం రాదు కదా అంటున్నారు.

ఇక పోతే. అబ్బాయిలు కూడా అంతే. ఏదో ఏజ్ 20 నెంబర్ క్రాసైందని.. పాతికలో పడిపోయామని లెక్కలేసే మాటేలేదు. ముప్పై వచ్చినా.. క్రాసైనా ఫర్లేదు కానీ.. లైఫ్ లో సెటిల్ కావడమే ఫస్ట్ అంటున్నారు. అదే బెస్ట్ అంటున్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ పొజిషన్ గురించి ఆలోచిస్తున్నారు అబ్బాయిలు. బండ్లు కార్లే కాదు. ఇళ్లతో పాటు.. లైఫ్ టైం ఫ్యామిలీతో హేపీగా బతకడానికి.. ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. అలా కుదిరితేనే మేరేజ్ అంటున్నారు. ముప్పై ఏళ్లొచ్చినా.. పెళ్లి గురించి పెద్దగా ఆలోచించని వాళ్లు బోలెడు మంది. ఫస్ట్ కెరీర్.. నెక్స్టే మేరేజ్. అంతేకానీ.. వాళ్లడుగుతున్నారు.. ఈళ్లడుగుతున్నారు అని మేరేజ్ చేసుకుని కొత్త రెస్పాన్సిబులిటీని ముందే మెళ్లో వేసుకోవడానికి రెడీ కావడం లేదు. సింపుల్ గా చెప్పుకుంటే.. అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా.. లైఫ్ ప్లాన్ కరెక్ట్ గాసెట్ అయినాకే.. మేరేజ్ అంటున్నారు. అప్పటి వరకు బేచిలర్ లైఫ్ లో బిందాస్ గా బతికేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యే వారి సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కావాలంటే.. ముందే ప్రిపేర్ అవ్వాలనేది వారి లెక్క.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy