వీళ్ళకు రాజకీయం డబ్బు కోసం కాదు

pitభారత దేశంలో రాజకీయం అధికారం కావాలనుకునే వారికే ఒక కెరీర్ చాయిస్ గా ఉంటూ వచ్చింది. డబ్బులు ఉన్న వారు సీటులో ఉన్నవారిని ‘మేనేజ్’ చేసుకుంటూ కింగ్ మేకర్స్ గానే ఉండటాన్ని ఇష్ట పడ్డారు. అలా కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కుబెరులంతా తమ తమ ఆర్ధిక సామ్రాజ్యాలను కాపాడుకోవడానికి, అధికారం మాటున మరింత ఎదగడానికి వచ్చిన వారుగానే కనిపిస్తుంది. ప్రఫుల్ పటేల్, రాజ్ కుమార్ ధూత్, సుబ్బిరామి రెడ్డి, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ముఖ్య ఉదాహరణలు.

అలా కాకుండా ఇప్పుడో కొత్త ‘క్లాస్’ పుట్టుకువస్తుంది. ఈ బిలియనీర్స్ క్లాస్  సమాజానికి చేతనైన మేలు చేద్దామని, తమ బిజినెస్ విజయాలను ఈ రంగంలో కూడా పునరావృతం చేద్దామని ఆకాంక్షిస్తున్నారు. ఆయా ప్రయాణాలలో తాము సంపాదించిన అనుభవాన్ని సమాజ క్షేమ కార్యాలకోసం వినియోగించడానికి NGO ల లాంటివే కాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగటమే మార్గమని వీరు నమ్ముతున్నారు. రాజీవ్ గాంధీ టైం లో సామ్ పిట్రోడా లాంటి ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ ప్రయత్నం చేసారు.

kir

తర్వాత చాలా కాలానికి దేశం లోని పలు ప్రాంతాల వ్యాపార దిగ్గజాలు మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధ పడుతున్నారు. మేం రెడీ అంటూ ప్రకటిస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా రాజకీయాన్ని, పాలనను కూడా తమకు మరో కార్య రంగం, మరో చాలెంజ్ గానే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ కొత్త వాతావరణం ఏర్పడేందుకు ధిల్లీలో AAP రూపంలో వచ్చిన జన జాగరణ ఒక ముఖ్య కారణంగా కనబడుతుంది. దానికి నిదర్శనమన్నట్లు కార్పోరేట్ రంగం నుండి AAP లో చేరుతున్న వారి సంఖ్య విపరీతంగా ఉంది.

ఇలాంటి వారిలో యావత్ దేశాన్ని ఆకర్శిస్తున్న వ్యక్తి నందన్ నీలేకని. ఆధార కార్డుల పథకం తో అందరి దృష్టినీ ఆకర్షించిన నీలేకని Infosys సహ వ్యవస్థాపకుడు. రాహుల్ గాంధీ కాకుండా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఈయన గురించి ప్రచారం జరుగుతుంది. బెంగుళూరు నుండే ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న మిగితా ప్రముఖులు V. బాలక్రిష్ణన్ – మరో ఇన్ఫోసిస్ దిగ్గజం, బయోకాన్ స్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఇప్పటికే ఓ సొంత పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసారు. మోహన్దాస్ పాయ్, అశ్విన్ మహేష్, RK మిశ్రా లు కూడా ఇప్పడికే రంగంలో ఉన్నారు. డెక్కన్ ఏవియేషన్ తో విమానయాన రంగాన్ని కుదిపేసిన కెప్టెన్ గోపీనాథ్ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసారు.

gopi mallya

అయితే ఇలాంటి వారంతా బెంగళూరు నుండే ఎక్కువగా ఉన్నారెందుకనేది మిగితా దేశమంతా ఆలోచించాల్సిన ప్రశ్న. హైదరాబాద్ గురించి ఆలోచిస్తే TDP లో సుధీష్ రాంభొట్ల, పాలెం శ్రీకాంత్ రెడ్డి లు ఉన్నారు. రాజకీయాలు వీరికి మరో కెరీర్ చాయిస్ గా వచ్చారా, లేక సమాజాన్ని బాగు చేయడం కోసం ప్రత్యక్ష కార్యాచరణ కు దిగారా అన్నది ఇప్పుడే తేలే వ్యవహారం కాదు.

AAP ఎఫెక్ట్ హైదరాబాద్ పై విస్తరించడానికి ఇంకా టైం ఉన్నట్లుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy