వీసీల నియామకాల్లో మార్పులు

OUయూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ల నియామకాల్లో మార్పులు చేస్తూ..ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. గతంలో ఉన్న నిబంధనలను సడలించింది. ప్రొఫెసర్ గా ఐదేళ్లు లేదా పరిశోధన సంస్థల్లో ఐదేళ్లు లేదా యూనివర్శీలో ఐదేళ్ల పాలనాపరమైన అనుభవం ఉండాలని.. ఉత్తర్వులో స్పష్టంచేసింది. ఇప్పటికే వీసీల నియామాకం కోసం సెర్చ్ కమిటీలను నియిమించిన ప్రభుత్వం.. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.

ఇక యూనివర్శిటీ చట్టంలో మార్పులు తేవాలని డిసైడైంది ప్రభుత్వం. దీనిపై సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ పని పూర్తిచేయాలని భావిస్తోంది. యూనివర్శిటీలో చదువు కంటే ఇతర అంశాలు ఎక్కువయ్యాయనే అభిప్రాయంతో ఉన్న సర్కార్.. దీన్ని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్ లో విద్యావ్యవస్థ విచ్ఛిన్నమయ్యే అవకాశాలన్నాయని  ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్శిటీ విద్యావ్యవస్థను పటిష్టం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది.

పలు యూనివర్శిటీకు పూర్తిస్థాయి వీసీలు లేరు. ఇంచార్జ్ విసీలు, ఐఏఎస్ ల పాలనలో సమస్యలు వస్తున్నాయి. దీంతో వీసీల నియామకంపై దృష్టిపెట్టింది ప్రభుత్వం. విసీలతో పాటు ఒక్కో యూనివర్శిటీకి చాన్సలర్ ను నియమించే ఆలోచన చేస్తోంది. చాన్స్ లర్లుగా విద్యావేత్తలు, మేధావులు,విద్యారంగంలో అనుభవం ఉన్నవారిని నియించటం వల్ల వర్శిటీ విద్యను గాడిలో పెట్టొచ్చనుకుంటోంది ప్రభుత్వం.  ఇప్పటి వరకు చాన్సలర్ గా గవర్నర్ వ్యవహరిస్తారని యూనివర్శిటీ చట్టంలో ఉంది. దీనికి సవరణ తేనుంది ప్రభుత్వం. వీరి పదవీ కాలాన్ని ఐదేళ్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమౌతున్నాయి. చాన్సలర్ గా గవర్నర్ స్థానంలో మరొకరిని నియమిస్తే.. చాన్సలర్ పదవి మరో పవర్ సెంటర్ అవుతుందనే విమర్శలున్నాయి. దీనిపై  రాజకీయపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన చట్ట సవరణ చేసే అవకాశాలున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy