వెంకటరామిరెడ్డి స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: కేసీఆర్

kcrసమైక్య రాష్ట్రంలో తెలంగాణ మహనీయులకు సరైన గౌరవం దక్కలేదన్నారు సీఎం కేసీఆర్. రెడ్డి హాస్టల్ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆనాడు రావు బహదూర్ వెంకటరామిరెడ్డి.. ప్రస్థావన ఉండేది కాదని.. ఆయన తర్వాతి తరానికి చెందిన సురవరం ప్రతాపరెడ్డి ఆయన గురించి రాశారు కాబట్టి.. ఈ విషయాలైన తెలుస్తున్నాయన్నారు. అప్పా పేరు తొలగించి.. వెంకటరామిరెడ్డి పేరు పెట్టుకున్నామన్నారు. చాలా ధ్వంసం జరిగిందని.. దానికి ఉదాహరణ కేపీహెచ్ బీ కాలనీ పేరు మర్పే అన్నారు. ధర్మారెడ్డి కాలనీ పేరు మార్చి … కేపీహెచ్ బీ పేరు పెట్టారన్నారు. హౌజింగ్ బోర్డ్ చైర్మన్ గా, గృహనిర్మాణ శాఖ మంత్రిగా అపూర్వ సేవలు అందించిన ధర్మారెడ్డికి తీరని అన్యాయం జరిగిందన్నారు.

దళితులకు రిజర్వేషన్ కల్పించిన గొప్పతనం రాజారెడ్డి వర్మదన్నారు. సంబంధం లేని ఎన్నో పేర్లు ఇక్కడ ఉన్నాయని.. వాటన్నింటినీ పునరుద్దరించుకోవాలని పిలుపునిచ్చారు. 150 ఏళ్ల క్రితం వికసించిన కుసుమం వెంకటరామిరెడ్డన్నారు. వనపర్తి రాజారామేశ్వరరావు – 1  మేనల్లుడి మేనల్లుడే మన రావు బహదూర్ వెంకటరామిరెడ్డి అన్నారు. ఎస్సైగా జీవితాన్ని ప్రారంభించి… కొత్వాల్ స్థాయికి ఎదిగారన్నారు. ఆ పదవిలో 14 ఏళ్లు సుస్థిరంగా ఉన్నారన్నారు. వెంకటరామిరెడ్డి  పేద, బడుగుల కోసం పనిచేశారన్నారు. మంచి సమాజం కోసం పనిచేయాలని సంకల్పం చేశారు. రెడ్డి హాస్టల్ లో అందరికీ అవకాశం కల్పించారని.. ఓల్డ్ సిటీలో దళితులకు స్కూల్ కూడా ఏర్పాటు చేశారన్నారు సీఎం.

ప్రఖ్యాత వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డిని  రెడ్డిహాస్టల్  కార్యక్రమాలు చూసుకునేందుకు నియమించారన్నారు. చంద్రునికి  ఓ నూలుపోగులా … రెడ్డి హాస్టల్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇది రెడ్డి హాస్టల్ కు ఇస్తుందన్న డబ్బో.. భూమో కాదు.. ఇది చారిత్రక వారసత్వ సంపదను పునరుజ్జీవం చేసేందుకు చేస్తున్న ప్రయత్నమన్నారు. ప్రాతఃస్మరణీయుడైన రావు బహదూర్ వెంకటరామి రెడ్డి .. మహిళల విద్యాభివృద్ధికి కృషి చేశారు. ప్రధానులు, మంత్రలు, డాక్టర్లు, ఇంజినీర్లు ఎందరో ఇక్కడి నుంచి ఎదిగారన్నారు.

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెబితే అది ఆర్డరే అని….. 10 ఎకరాల స్థలంతో పాటు అదనంగా ఐదు ఎకరాలు ఇస్తామన్నారు. బాలికల హాస్టల్ దగ్గర 1500 గజాల స్థలం.. కేటాయించాలి.. ఈ రెండింటిపై జీవోలు బుధవారం సాయంత్రం విడుదల చేస్తామన్నారు.

శాంతాబయోటెక్… వరప్రసాద్ రెడ్డి కృషి గొప్పదన్నారు. ఫార్మారంగంలో ఆయన చేస్తున్న సేవలు విలువకట్టలేనివన్నారు.

ఎడ్యుకేషనల్ ఇన్సిస్టిట్యూట్ ను చిరస్థాయిగా నిలిచేటట్టు నిర్మించాలని అదే తన కోరిక అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్నారు. వెంకటరామిరెడ్డి స్ఫూర్తితో పని చేయాలి. ఉన్నత విద్యాసంస్థగా రూపుదిద్దాలని.. మంచి విద్యాసంస్థల సమాహారంగా దీన్ని నిర్మించాలన్నారు. కులమతాలకు అతీతంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నామని.. మనదైన పద్ధతిలో మనదైన యాస భాషలో ఆయన్ను స్మరించుకుంటున్నామన్నారు కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy