వెంకటేష్, మారుతి ల “రాధా” ఈ రోజు ప్రారంభం

maru

వెంకటేష్ కథానాయకుడుగా యూనివర్సల్ మీడియా దానయ్య నిర్మాణంలో మారుతి దర్శకత్వంచేయనున్న ‘రాధా’ చిత్ర షూటింగ్ ఈరోజు, 6న ప్రారంభం కానుంది. నయనతార ఈ సినిమాలో కథానాయిక. గతంలో వెంకటేష్, నయనతారలు “లక్ష్మీ”, “తులసీ” లలో కలిసి నటించారు. హోమ్‌మినిస్టర్‌గా హీరో, మధ్యతరగతి అమ్మాయిగా హీరోయిన్‌ల మధ్య ప్రేమకథా చిత్రంగా ఉంటుందని, వినోదంతోపాటు అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుందని, ఈనెల 6నుండి పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభించనున్నామని దానయ్య తెలిపారు. మారుతి దర్శకత్వం వహించిన “కొత్త జంట” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: ఉద్ధవ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy