వెంకన్నా… నువ్వేం దేవుడవయ్యా.?

kanimozhi_3తిరుమల తిరుపతి వెంకన్న… కోట్లాది మందికి ఆరాధ్యదైవం. ఆయనకు కానుకలు.. మొక్కుబడుల రూపంలో కోట్లాది రూపాలు దక్కుతున్నాయి. ఆయనపై ప్రేమతో నడిచొచ్చే భక్తుడు ఒకరైతే… ఆయన్ను దూరం నుంచే చూసి మురిసి పోయేవాడు మరొకరు. అంతలా ప్రపంచవ్యాప్తంగా భక్తులున్న దేవుడు … ఏడుకొండలవాడు. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె.. ఆ పార్టీ ఎంపీ కనిమొళి. ‘తిరుమల వేంకటేశ్వరుడు కోటీశ్వరులకే దేవుడు. పేదవారు ఆయన్ను దర్శించుకోవాలంటే పడిగాపులు కాయాల్సిందే. తన హుండీనే కాపాడుకోలేని ఆయన భక్తులనెలా కాపాడతాడు? తిరుమలేశుడికి శక్తులే ఉంటే ఆయనకు భద్రత ఎందుకు?’’ ఇవీ ఆమె సంధించిన ప్రశ్నలు. ఇటీవల తిరుచ్చిలో జరిగిన ‘నాస్తిక సమాజం మహానాడు’లో కనిమొళి ఏడుకొండలవాడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలూ మానవులను విడగొడుతున్నాయని, నాస్తికవాదమే మానవ జాతి కలిసి ఉండేలా చేస్తుందని తెలిపారు. మహిళలను బానిసలుగా మార్చేలా మతాలు ఉసిగొల్పుతున్నాయని, ప్రపంచ యుద్ధాల కంటే మతాల వల్ల చిందిన రక్తమే అధికమని కనిమొళి అన్నారు. జాతి, మత ఘర్షణలు, వాదాలను నిర్మూలించాలంటే మానవతావాదాన్ని, నాస్తికవాదాన్ని వ్యాపింపజేయాలని ఆమె పిలుపునిచ్చారు. వెంకన్నపై కనిమొళి చేసిన వ్యాఖ్యలపై హిందూమక్కల్‌ కట్చి మండిపడింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. జాతీయ భద్రత చట్టం కింద ఆమెను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy