వెంకన్న కథలు – భక్తుడితో పాచికలాడిన శ్రీవారు

Venkanna-Kathalu-Part04బ్రహ్మోత్సవం… బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం… ముక్కోటి దేవతలు… కోట్లాది భక్తులు కళ్లార్పకుండా చూసుకునే సంబరం. కోనేటి రాయుణ్ణి తనివి తీరా దర్శించుకొని తన్మయం చెందే మహోత్సవం. అలాంటి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా వీసిక్స్ ప్రత్యేక కథనాలు అందిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో రోజుకో స్పెషల్ స్టోరీతో తిరుమల తిరుపతి చరితామృతం మీకోసం…

వెంకన్న దర్శనమే మహాభాగ్యంగా భావిస్తారు భక్తులుఅలాంటిదివెంకన్నే సాక్షాత్కరించి ఓ భక్తుడికి దర్శనమిచ్చాడంటే….ఆ భక్తుడెంత అదృష్టవంతుడో.. ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. ఇంతకీ..  ఆ పరమభక్తుడు ఎవరు…? ఇవాల్టి వెంకన్న కథల్లో చూడండి.

వినరో భాగ్యమువిష్ణు కథఅన్నారు..  వినడానికేస్వామివారి  చరిత్ర అంత మధురంగా ఉంటే….ఇక ఆయన కనువిందైన రూపం చూడ్డానికి ఎంత మనోహరంగా ఉంటుందో. అసలుఆ దర్శనభాగ్యం దక్కితేఅంతకంటే అద్రుష్టవంతులెవరైనా ఉంటారాతిరుమల వెంకన్న సేవలో తరించిన ఓ భక్తుడి కథను, ఆ భక్తుడే కోట్లాది భక్తులకు ఆరాధ్యదైవంగా మారిన ఆ చారిత్రకగాథ ఏంటీ..? ఇంతకి ఆ పరమ భక్తుడు ఎవరు, ఎక్కడివాడు.   

తిరుమలేషుని సన్నిధిలో ఐదు వందల ఏళ్ల క్రితం ఓ అద్భుతం జరిగింది. అది మామూలు అద్భుతం కాదు. ఓ రోజు శ్రీవారు నేరుగా ఓ భక్తునికి దర్శనమిచ్చాడు. దర్శనమివ్వడంతోనే ఊరుకోలేదు శ్రీవారు. ఆ భక్తుడితో ప్రతిరోజు ఏకాంత సేవలో సరదాగా  పాచికలు ఆడాడు. పరవశించి పోయిన ఆ భక్తుడు శ్రీవారి ఆనంద నిలయం పక్కనే తన ఆవాసం ఏర్పర్చుకున్నాడు. ఆ తరువాత కాలక్రమేనా ఏడుకొండలపైవెంకన్న తర్వాత అతను కూడా ఓ దేవుడిగా వెలిగాడు. ఆ భక్తుడి ఆనవాళ్లే కాదు ఆయన వారసులు కూడా నేటికీ తిరుమల క్షేత్రంలో శ్రీవారి సేవలో తరిస్తున్నారుఆ పరమ పవిత్ర భక్తుడి పేరు హథీరాంజి బావాజి.

భూలోక వైకుంఠంగా వెలుగుతున్న తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భారతదేశంలోని నలుమూలలా అనేక మంది భక్తులు ఏడుకొండలకు వచ్చారు. రాజులు, సాధారణ ప్రజలేకాదు తపస్సు చేసుకునే మునులు కూడా తిరుమలకు తీర్థయాత్రలు చేశారు. అలా ఐదు వందల ఏళ్ల క్రితం వెంకటాచలక్షేత్రానికి వచ్చాడు బావాజీ అనే ఓ సన్యాసిఇతను ఉత్తర భారతదేశానికి చెందిన వాడు. ఇతన్ని మహంతు హథీరాంజి అనికూడా పిలిచేవారు. తిరుమ క్షేత్రాన్నిఆ వెంకన్న రూపాన్ని చూసి పరవశించిపోయి శ్రీవారి సన్నిధిలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. కోటి సూర్య ప్రకాశంతో వెలుగుతూ నిత్యం కాంతులీనుతున్న ఆనందనిలయంపై బంగారు గోపురం నిరంతం కనపడేవిదంగా ఆలయానికి ఎత్తైన ప్రదేశంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నాడుతిరుమల యాత్రచేసే ప్రతిభక్తుడిలోనూ ఆ వేంకటాద్రిపతిని దర్శించి బావాజీ తన్మయుడయ్యేవాడు. అందుకే తిరుమలకు వచ్చే యాత్రికులకు, సాధువులకు, సన్యాసులకు, అన్నదానాదులు  నిర్వహించేవాడు. ఎలాంటి కోరికలు లేకుండా అత్యంత పవిత్రంగా సేవచేస్తున్న బావాజీకి పిలిస్తే పలికేవాడట వెంకన్న. అంతేకాదు ప్రతిరోజూ మాట్లాడేవాడు ఈయన చెప్పింది చేసేవాడుకాలక్రమంలో తిరుమలలో స్వామివారి దర్శనం ఒకవైపు.. మహంతు హథీరాంజి దర్శనం మరోవైపు…. ఇలారెండు క్షేత్రాల దర్శనంతో భక్తులు పునీతులయ్యేవారు. ఒక దశలో శ్రీవారి దర్శనం కాకపోయిన మహంతు దర్శనం అయితే చాలు అనుకున్నారట భక్తులు.

ప్రతిరోజు ఏకాంత సేవానంతరం తిరుమల క్షేత్రం అంతటా నిశ్శబ్దవాతావరణం అలుముకున్న వేళ సాక్షాత్తు ఆనందనిలయం నుంచి శ్రీవారు తన ప్రియ భక్తుడైన బావాజీ విడిదికి వెళ్లేవాడు. అక్కడ బావాజీతో పాచికలాడేవాడు. స్వామివారు, హాథీరాంజీ స్నేహాన్ని అప్పట్లో  స్వయంగా చూసిన భక్తులు ఉన్నారు. స్నేహితులిద్దరూ…. పాచికలు ఆడుకునేవారు. పాచికల శబ్ధం బయటకు వినిపించేదట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే…. ఈ ఆటలో…. భక్తుడ్ని గెలిపించేందుకు….వేంకటేశ్వరుడుఓడిపోయేవాడట. అదేంటీ స్వామీఅంటే…. నీ భక్తికి నేనిచ్చే కానుక అనేవారట స్వామి.

ఒకసారిచంద్రగిరి రాజుకు….బావాజీతో శ్రీవారు నిజంగానే మాట్లాడతాడా.. అన్న సందేహం వచ్చి ఓ పరీక్ష పెట్టాడు. ఒక గదిలో.. బావాజీని బంధించి…. గది నిండుకునేంత చెరకు గడలు వేసి…. బావాజీ భక్తిలోని శక్తిని పరీక్షించాలనుకున్నాడు. తెల్లారేసరికి చూస్తే…. గదిలో ఒక్క చెరుకు గడ కూడా లేదు. స్వామివారు.. ఏనుగు రూపంలో వచ్చిచెరుకంతా తినేశారు. అంతే.. ఈ సంఘటన తర్వాతబావాజీ తిరుపతి తిరుమలలో ప్రధానమైన వ్యక్తిగా, మహాభక్తునిగా కొలవబడ్డాడు. ఇకఆనాటి నుంచి..స్వామివారి సేవలో బావాజీ..పాత్ర కీలకంగా మారింది. ప్రతిరోజు సుప్రభాతవేళలో నివేదనకుగాను అప్పుడే పిండిన ఆవుపాలను, నవనీతాన్నిపచ్చకర్పూరం హరతిని సమర్పించేవాడు. ఈ సంప్రదాయం ఇప్పటికీ బావాజీ  వారసులు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు సుప్రభాతవేళకు మఠానికి చెందిన ఓ సాధువు ఆవుపాలను, వెన్నను, పచ్చ కర్పూర హరతిని పట్టు వస్త్రంతోపాటు తీసుకుని  సన్నిధి గొల్ల, అర్చకులతో కలిసి ఆనందనిలయంలోకి ప్రవేసిస్తారు. స్వామివారికి మహంతు మఠం నుంచి వచ్చిన వాటిని నివేదించి తాంబూలాన్ని సమర్పించి నవనీత హరతినిస్తారు. ఈ సంప్రదాయం ఈనాటికీ  కొనసాగుతుంది. ఇక మహంతు మఠాల్లో ఉండే సన్యాసులంతా హతీరాంజీ వారసత్వాన్నే మహంతులు తరాలుగా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వీళ్లు పెళ్లీళ్లు చేసుకోరు..జీవితాంతం బ్రహ్మచారులుగానే ఉండిపోతారు. వీళ్లంతా ఉత్తర భారతదేశం నుంచి వచ్చినవాళ్లే. వేదాలు చదువుకుని తిరుమల కొండపై అడుగుపెట్టిన వీళ్లు ..ఐహిక బంధాల్ని వదులుకుని చివరి వరకు మఠం సేవలో, శ్రీవారి సన్నిదిలోనే గడుపుతారు

వెంకన్న భక్తుడిగా  మారాకహాథీరాంజీకి శ్రీహరి స్మరణే  జీవితమైంది. ఆకాశగంగ తీర్థం సమీపంలో ఓ ఆశ్రమాన్ని నిర్మించుకుని  తపస్సు చేసుకున్నాడు. అదే ఆశ్రమ ప్రాంగణంలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించాడు. అప్పటికే పెరిగిన భక్తుల రద్దీతో తన తపస్సుకు భంగం కలుగుతున్నందున  ఆలయానికి అతి సమీపంలోనే సజీవసమాధి అయ్యాడు. నేటికి ఆయన సమాధికి ప్రతిరోజు వేల మంది భక్తులు  వచ్చి వేణుగోపాల స్వామిని, పక్కనే ఉన్న  జీవసమాధిని దర్శించుకుని వెళ్తారు. తమ కోరికలు తీరాలని జీవసమాధి పక్కనే ఉన్న చెట్టుకు కంకణాలు కట్టి వెళ్తాంటారు భక్తులు. హతీరాంజీ జీవ సమాధి పక్కనే ఆయన శిష్యులకు సంబంధించిన సమాధులు కూడా కనిపిస్తాయి.  

హాథీరాంజీ మఠానికినిత్యం ఉత్తరభారతదేశం నుంచి  భక్తులు వస్తుంటారు. అంతేకాదు హథీరాంజి బావాజిని బంజారాలు, సుగాలీలు వంటి గిరిజనులు తమ ఇలవేల్పుగా  కొలుస్తారు.  ఇక్కడికి వచ్చాకవారు మహంతుల ఆశీస్సులు తీసుకుంటారుతమ కష్టాలు చెప్పుకుంటారు….  మొక్కులు చెల్లించుకుంటారు. బావాజీ శ్రీవారితో పాచికాలాడిన స్థలానికి పూజలు చేస్తారుపాటలు పాడతారు. ఒకరాత్రి ఈ ఆశ్రమప్రాంగణంలో నిద్రపోతారు. ఏడుకొండలకు వచ్చాక ముందుగా మహంతులను దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ లంబాడీలు తమ పిల్లలకు మహంతుల చేతుల మీదుగా కంకణాలు కట్టిస్తారు. తమ పిల్లలకు పేర్లు పెట్టించుకుంటారు. అందుకే మన లంబాడీల్లో .చాలా మందికి  హాథీరాంజీ అన్న పేరు ఉంటుంది.

శ్రీవారి భక్తుడిగానే గాకుండాఆయన భక్తల సేవలో తరించాడు…. హథీరాంజీ. అయితే ఆయన వారసులు కూడా ఆయన భక్తిసేవలను కొనసాగించారు. ఆయన వారసులు మహంతు నామకరణంతో మఠం బాధ్యతలు నిర్వహించారు.   బ్రిటీష్ పాలకుల కాలంలో 1843 జులై 16న తిరుమల తిరుపతి ఆలయ నిర్వహణ బాధ్యతను ఈ హాథీరాంజీ మఠానికే  అప్పగించారు. తిరుమల వెంకన్న యావదాస్తి.. అంటే  ఆభరణాలు, అలంకారాలు, కిరీటాలు, నగలు, పట్టువస్ర్తాలు, పాత్రలు, ఉత్సవమూర్తులు వాహనాలు, వాటికి సంబంధించిన అన్ని రకాలైన వస్తువులతోపాటు ఆదాయవ్యయ లెక్కలను ఆనాటి మహంతు అయిన సేవాదాసుజీకి అప్పగించారు. 1933 వరకు అంటే….. 90ఏళ్లపాటు తిరుమల వెంకన్న నిర్వహణ బాధ్యతలు ఈ మఠం ఆధీనంలో ఉన్నాయి. ఈ కాలంలో తిరుపతి చాలా అభివృద్ధి చెందింది. ధర్మసత్రాలు, కాలిబాటలో మెట్ల మరమ్మతులు, గాలిగోపుర నిర్మాణం, రహదారులు, తాగునీరు, కాలిబాటలో విద్యుద్దీపాలు, ఆఫీసు నిర్మాణం, దేవస్తానం ముద్రణాలయం, వేదపాఠశాల, ఆయుర్వేద పాఠశాల, దేవాలయాల శిలాశాసనాల పరిశోధన, స్వామివారి ఆభరణాలు, కిరిటాలు వంటివన్నిహాథీరాంజీ మఠం ఆధ్వర్యంలోనే జరిగాయి. 1933 తర్వాతకొన్ని కారణాల వల్ల.. వెంకన్న ఆలయాల నిర్వహణ కోసం.. ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేశారు. ఈ మండలి తర్వాత ఏర్పడిందే తిరుమల తిరుపతి దేవస్థాన కమిటి. కొండపై ఉన్న మఠంలో కూడా చాలా సత్రాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే సన్యాసులు ఇక్కడే విడిది చేస్తారు. శ్రీవారి నైవేద్యానికి ఓ ప్రత్యేక  గోషాలను నిర్వహిస్తున్నారు. ఇక ఆశ్రమానికి వచ్చే భక్తుల కోసం  నిత్య అన్నదాన కేంద్రాల నిర్వాహణను ఇప్పటికీ మహంతు వారసులు కొనసాగిస్తున్నారు.

విశిష్ట వ్యక్తిత్వం, పవిత్రత, సాధుత్వం, భక్తి ఇవన్నీ కలిపితేనే హతీరాంజి అవుతాడు. వెంకన్నకు అనాటి నుంచి ఈనాటి వరకు అత్యంత ప్రియ భక్తుల్లో హతీరాంజీ ఒకరు. అందుకే ఆయన ఆనవాళ్లు ఏడుకొండల్లో ఎటుచూసినా కనిపిస్తుంటాయిఇప్పటికీ ఏకాంత సేవ అనంతరం భావాజీతో శ్రీవారు పాచికలు ఆడుతారన్న నమ్ముతారు భక్తులునమ్మిన వాళ్లను, తానే సర్వస్వం అనుకున్న వాళ్లనుస్వామివారు ఎంతగా ఇష్టపడతారో చెప్పడానికి   హాథీరాంజీ వృత్తాంతమే నిలువెత్తు నిదర్శనం.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy