వెంకన్న సన్నిధిలో దొంగల బీభత్సం

tiruppati (1)తిరుమలలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కౌస్తుభం అతిథిగృహంలో బస చేసివున్న ఇద్దరు మహిళలపై మత్తుమందు చల్లి… నగదు, నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ఘటనలు లేకుండా ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఊపిరి పీల్చుకుంటున్న టైమ్ లో ఈ ఘటనతో ఉరుకులు..పరుగులు తీశారు పోలీసులు. విజిలెన్స్ సమాచారంతో ఘటన స్థలానికి చేరుకూతీ విచారణ చేపట్టారు. తమిళనాడు కాంచీపురానికి చెందిన ఇద్దరు మహిళలపై.. గుర్తుతెలియని దుండగులు మత్తుమందు చల్లి.. మేడలో ఉన్న బంగారు గొలుసులను, నగదును దొంగిలించినట్లు చెబుతున్నారు పోలీసులు. అయితే ఇందులో ఒక మహిళ అపస్మారక స్థితిలో ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత మహిళలను విచారించి.. దొంగలను పట్టుకుంటామన్నారు పోలీసులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy