వెంకన్న సన్నిధిలో విషాదం

TPT KAPILATEERTHAM VISHADAM 01కపిలతీర్థం పుష్కరిణిలో ఈతకు వెళ్లి ఏడుగురు యువకుల మృతి

విహారయాత్ర విషాదంగా మారింది. ఈత సరదా.. ఏడుగురి ప్రాణాలు బలిగొంది. తిరుపతిలోని కపిలతీర్థంలో మునిగి.. ఏడుగురు యువకులు చనిపోయారు. సరదాగా జలపాతంలో ఈత కొడుతుండగా.. ఒక్కసారిగా వరదపోటెత్తడంతో.. పుష్కరిణిలోకి జారిపడి మృతి చెందారు. మృతులంతా తిరుపతి వాసులే. తిరుపతిలోని..చంద్రశేకర్ రెడ్డి కాలనీ, ఖాదీ కాలనీకి చెందిన కొందరు యువకులు.. కపిలతీర్థం జలపాతంలో ఈతకొట్టేందుకు వచ్చారు. అటవీభాగంలో ఉన్న రాతి గుంతల్లో సరదాగా ఈత కొడుతున్నారు. ఆ టైంలో కొండపై భారీ వర్షం పడటంతో.. ఒక్కసారిగా జలపాతంలోకి వరద పోటెత్తింది. వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఏడుగురు యువకులు.. 25 అడుగుల ఎత్తు నుంచి 150 అడుగుల లోతున్న పుష్కరిణిలోకి జారిపడ్డారు. ఈ ఇన్సిడెంట్ లో మొత్తం ఏడు మంది చనిపోయారు. అక్కడే ఉన్న సిబ్బంది యువకులను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పుష్కరిణిలో..గాలించి.. మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో కొందరిని గుర్తించారు. చనిపోయిన వారిలో చంద్రశేఖర్ రెడ్డి కాలనీకి చెందిన బైక్ మెకానిక్ లు శ్రీకాంత్, తాహిద్ లతో పాటు.. ఖాదీ కాలనీకి చెందిన నిఖిల్, సచిన్ వర్మ, మధురానగర్ కు చెందిన బాలాజీలున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులని తేలింది. మిగిలిన వాళ్లు ఎవరనేది ఇంకా తెలియలేదు.

TPT KAPILATEERTHAM VISHADAM 02ప్రమాద విషయంలో తెలుసుకున్న టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావులు లతో పాటు టీటీడీ బోర్డు సభ్యులు వెంటనే సంఘటనస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.డెడ్ బాడీలను రుయా హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై ఏసీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy