వెంకయ్యనాయుడికి ఘనంగా పౌర సన్మానం

Vice-President-Venkaiah-Naidu-KCRఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఘనంగా సన్మానించారు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇతర పుర ప్రముఖులు హాజరయ్యారు. పండితులు వేద మంత్రాలతో ఆశీర్వాదం అందించారు. యాదాద్రి ప్రసాదం అందజేశారు.

తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రతిగా బాధ్యతల నిర్వర్తించటం గర్వకారణంగా అభివర్ణించారు సీఎం కేసీఆర్. అంచెలంచెలుగా ఎదిగిన ఎదిగిన వ్యక్తిగా కీర్తించారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమ నేపధ్యం నుంచి రాజకీయాల వైపు వెళ్లిన చరిత్ర అందని ప్రశంసించారు. 1980లోనే వెంకయ్యను చూశానని.. ఆయన ప్రసంగాల్లో ఉత్తేజం ఉంటుందన్నారు. తెలుగు భాషపై ఆయన ఉన్న మక్కువ, పట్టుతో వ్యంగ్యంతోపాటు హాస్యం, రౌద్రం ఇలా అన్ని సమ్మిళతాలతో ప్రేక్షకులను అలరించగల అద్బుత వక్త అని ప్రశంసించారు కేసీఆర్.  ఎమర్జెన్సీ కాలంలో సిద్ధిపేట వచ్చిన సమయంలో ఆయన ప్రసంగం విన్నానన్నారు. దేశమే గర్వించగల గొప్ప వక్తగా ఎదగటం వెనక ఎంతో కృషి ఉందన్నారు. తెలుగు నేలపై వెంకయ్యనాయుడు తెలియని వారు లేదని.. అలాంటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తిని సన్మానించుకోవటానికి అవకాశం ఇవ్వటంపై ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్.

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం ఘనంగా జరిగింది.  తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన పౌరసన్మానానికి అతిరథమహారథులు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వెంకయ్య నాయుడు రావడంతో.. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌లో ఆయనకు పౌరసన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు వెంకయ్యనాయుడితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy