వెండితెర ‘బాహుబలి’ బర్త్ డే స్పెషల్

27-prabhas1-300ఈశ్వర్ లా వచ్చాడు. అడవి రాముడయ్యాడు. వర్షంలో బ్యూటీతో చిందేశాడు. చత్రపతిగా సూపర్ ఇమేజ్ తెచ్చుకుని.. బుజ్జిగాడిగా అందరికీ దగ్గరయ్యాడు. బిల్లా మూవీతో డాన్ గా మారిపోయి… బాహుబలి సిన్మాతో టాలీవుడ్ లో సూపర్ హీరో అయిపోయాడు ప్రబాస్. మాస్ హీరోగా హిట్టైన చోటూగాడు.. ఇవాళ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

అమీర్ పేట్ కి…. దూల్ పేట్ కి.. షెహరొకటేరా అంటూ వచ్చాడు ప్రభాస్. మాస్ ప్రేక్షకులకి దగ్గరై పోయాడు. పెద్దింటమ్మాయిని ప్రేమించి.. నానా కష్టాలు పడి.. ప్రేమలో విక్టరీ కొట్టాడు. అక్కడ మొదలైంది ప్రయాణం. స్టెబ్బై స్టెప్ మెట్లెక్కేస్తూ వచ్చాడు.

ఈశ్వర్ లో మాసే. రాఘవేంద్రలోనూ మాసే. వర్షం మూవీలో చెన్నై చిన్నదాంతో రొమాన్స్ చేసినా.. మాస్ హీరోగానే ఇమేజ్ పట్టాడు. తర్వాత కాలేజ్ స్టూడెంట్ గా మారిపోయాడు ప్రబాస్. అడవిరాముడిగా ఇరగదీశాడు. పొలిటీషియన్ కూతుర్ని.. ముట్టాయి గూడెం కుర్రోడు ఎలా గెలుచుకున్నాడనే లైన్ లో మేజిక్ చేశాడు. సిన్మా పెద్దగా ఆడకపోయినా.. ప్రబాస్ కి మాత్రం బానే పేరొచ్చింది.

మాస్ క్యారెక్టర్ లు బోర్ కొట్టాయో. డిఫరెంట్ కాన్సెప్ట్ మీద ఇంట్రస్ట్ కలిగిందో. కృష్ణవంశీ చెప్పిన లైన్ నచ్చిందో కానీ.. వెంటనే ఎవర్ గ్రీన్ మూవీ చేశాడు ప్రబాస్. స్మైల్ స్మైల్ అంటూ అందరినీ ఏడిపించాడు. నవ్విస్తూ ఏడిపిస్తూ.. ఆట పట్టిస్తూ.. మెస్సేజ్ లిస్తూ.. అమ్మాయిల్తో రొమాన్స్ చేస్తూ.. చక్రం సిన్మాలో ఒదిగిపోయాడు. లుక్కు మార్చి.. డైలాగ్ డెలివరీ మార్చి.. మొత్తం స్టైలే మార్చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు.

చక్రం సిన్మా చాలా చాలా డిఫరెంట్. వెంటనే ఒట్టేసి ఓమాట ఒట్టేయకుండా ఓమాట చెప్పనన్నాడు. చత్రపతి మూవీతో ఫ్యాన్స్ ని పట్టేశాడు. మాస్ ఎలిమెంట్స్ తో పాటు.. అమ్మ సెంటిమెంట్ కి ఇంపార్టెన్స్ ఉన్న స్టోరీ కావడంతో సూపర్ హీరో అయిపోయాడు. యూత్ మొత్తాన్ని.. లుక్కుతో గుంజేశాడు ప్రబాస్. సిన్మా బంపర్ హిట్టైంది. ఫ్యాన్స్ పెరిగిపోయారు. టాలీవుడ్ కి ఓ కింగులాంటి హీరో వచ్చాడని ప్రూవ్ చేసుకున్నాడు ప్రబాస్.

Mirchi_Movie_Latest_Stillsd3e69e2a0ef2a99ae340a01e7820a733చత్రపతి అంత హిట్టైనా.. రెగ్యులర్ ఫార్మాట్ ఫాలో కాలేదీ బుజ్జిగాడు. చత్రపతి తర్వాత మళ్లీ ట్రాక్ మార్చాడు. ప్రభుదేవా డైరెక్షన్ లో త్రిషతో రొమాన్స్ చేశాడు. పౌర్ణమి అంటూ వచ్చినా.. ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. మూవీ కాస్త సోసోగా ఆడినా.. యాక్టింగ్ లో వరకు సూపర్ అనిపించుకున్నాడీ బుజ్జిగాడు. ప్రియురాలి కోరిక తీర్చే క్యారక్టర్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.   పౌర్ణమి తర్వాత స్టైల్ మార్చాడు రెబల్ స్టార్. మళ్లీ మాస్ సబ్జెక్టులపై సైన్ చేశాడు. మాస్ ఇమేజ్ మెళ్లో వేసే వినాయక్ డైరెక్షన్ లో యోగిగా మారాడు. సిన్మా బిస్కెట్టైంది. మళ్లీ వెంటనే కాస్త లుక్కు మార్చి మున్నా అన్నాడు. అక్కడా అదే బిస్కెట్ తగిలింది. మున్నా తర్వాత పూరీతో కమిట్ అయ్యాడు ప్రబాస్. మాస్ ఇమేజ్ తో మొత్తం స్టైలే మార్చే పూరీ. యాజ్ టీజ్ గా తన మార్క్ ని ప్రబాస్ కి ఇచ్చేశాడు పూరీ. ఇంకేముంది. డార్లింగ్ అంటూ.. అందరికీ డార్లింగ్ అయ్యాడు బుజ్జిగాడు.

బిల్లా సిన్మాతో హాలీవుడ్ హీరోలా కనిపించాడు ప్రబాస్. గన్నులు.. గ్యాంగులు మేన్ టేన్ చేసినా.. నెక్స్ట్ మూవీలో అనాధ అయిపోయాడు. ఏక్ నిరంజన్ గా ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. సినిమాకి జనం పెద్దగా రెస్పాండ్ అవ్వకపోయినా.. తన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో మెస్మరేజ్ చేశాడు. డైలాగ్ డెలివరీతో ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు చోటూ.

prabhas-22తర్వాత అందరికీ డార్లింగ్ అయిపోయాడు చోటూ. కాజల్ తో రొమాన్స్ చేసి లవర్ బాయ్ గా కలెక్షన్లు పట్టాడు. డార్లింగ్ ని డార్లింగ్ లానే సెట్ చేసుకుని మిస్టర్ పర్ ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఫ్యామిలీ స్టోరీకి యాప్ట్ గా సెట్ అవుతాడు అనేలా యాక్ట్ చేశాడు. డార్లింగ్.. మిస్టర్ పర్ ఫెక్ట్ సిన్మాలతో.. బాక్సాఫీస్ కి డార్లింగ్ అయిపోయాడు.

తర్వాత రెబల్ గా మారినా డిసప్పాయింట్ అయ్యాడు బుజ్జిగాడు. లారెన్స్ డైరెక్షన్ అటీటు తిరిగి ఎటో పోయింది. ఇంకేముంది. కొరటాల శివతో కమిట్ అయ్యాడు. మిర్చిలాంటి కుర్రాడినంటూ మిర్చి మూవీ చేశాడు ప్రబాస్. లవర్ బాయ్ గా.. ఊరిని మార్చే హీరోగా.. విలన్లకి లెస్సన్ చెప్పే క్యారెక్టర్ లో ఇరగదీశాడు చోటూ. క్లాస్ లుక్కు.. మాస్ లుక్కు రెండింటినీ మిక్స్ చేసి మిర్చి మూవీ చేశాడు. అందరినీ అట్రాక్ట్ చేశాడు.

మరి ఇంత ఫాలోయింగ్ హీరోకి ఏమాత్రం తగ్గకుండా క్యారెక్టర్ డిజైన్ చేశాడు జక్కన్న. ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో బాహుబలిని చేశాడు. ఇంకేముంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. తెలుగు సిన్మా ఇండస్ట్రీకి బ్రాండ్ పట్టుకొచ్చాడు బాహుబలి. కలెక్షన్లతో బాక్సాఫీస్ నిండిపోయింది. నెక్స్ట్ కూడా బాహుబలిగానే రానున్నాడు. ఇప్పుడా పన్లోనే ఉన్నాడీ బర్త్ డే బాయ్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy