వెదర్ అలర్ట్ : మరో 48 గంటలు వడగళ్ల వానలు

rains

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు (మే 5, 6తేదీల్లో) వడగళ్ళ వాన పడే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలపైనే నమోదు అవుతాయని.. అప్పటికప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారిపోయి.. ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడే సమయంలో పొలాల్లోని రైతులు, రైతు కూలీలు, ఇతరులు ఎవరూ కూడా చెట్ల కింద వెళ్లొద్దని.. అది మరింత ప్రమాదం అని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా పెరగనున్నాయని.. సాధారణం కంటే అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ విభాగం అధికారులు.

శని, ఆదివారాలు ( మే 5, 6 తేదీల్లో) దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో గాలివాన ముప్పు పొంచి ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. జమ్మూకశ్మీర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తూర్పు రాజస్థాన్, విదర్భ, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఇసుక తుఫానులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. జమ్మూకశ్మీర్ తో పాలు పలు రాష్ట్రాల్లో బలమైన గాలులు వీయనునున్నట్లు వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy