వెదర్ వార్నింగ్ : కుండపోత వర్షాలు పడనున్నాయ్

తెలంగాణ వ్యాప్తంగా చల్లటి వాతావరణం ఉంది. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే రోబోయే 24 గంటల్లో అంటే.. జూలై 21వ తేదీ శనివారం రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. దీనికి కారణం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటమే. ఈ అల్పపీడనానికితోడు భూమికి 7 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ రెండింటి కారణంగానే భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, కొముర్రం భీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగైడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మూడు, నాలుగు చోట్ల అతిభారీ వర్షాలు కూడా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. మిగతా చోట్ల కూడా మోస్తరు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కూడా పడనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy