తెలంగాణను ఆదుకోవాలి: ఆర్ధిక సంఘం తో సీఎం కేసీఆర్

14TH FINANCE-2వెనకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని 14వ ఆర్ధిక సంఘంతో సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు 14వ ఆర్ధిక సంఘంతో ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణలో మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు చాలా వెనకపడి ఉన్నాయని కొత్త రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆర్ధిక సంఘాన్ని కోరారు. రాష్ట్రానికి వచ్చే నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని…వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపడుతుంది…విద్యుత్ లోటును తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమగ్ర సర్వే సక్సెస్ అయ్యిందని…దీంతో అర్హులకి నేరుగా సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy