వెరైటీ డిమాండ్స్ చేస్తున్న ఫుట్ బాల్ ఆటగాళ్ళు…

Soccer: World Cup-Brazil vs Croatiaబ్రెజిల్ లో జరుగుతున్న సాకర్ సమరానికి వచ్చిన ఫుట్ బాల్ ఆటగాళ్ళకు ఉన్న పేమ్ అంతా ఇంతా కాదు. నాలుగేళ్ళకొకసారి వచ్చే ఈ వరల్డ్ కప్ లో ఆటగాళ్ళకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చిన ఆటగాళ్ళకు ఎక్కడలేని సదుపాయాలు సమకూరుస్తారు. ఏం కావాలంటే అది…ఇంకా చెప్పాలంటే కొండమీద కోతినైనా తీసుకుని వస్తారు. దొరికిందే ఛాన్స్ అని ఆటగాళ్ళు కూడా తమ కోరికల చిట్టాను విప్పుతున్నారు. తాము నివసించే హోటల్స్ లో తమకు కావల్సిన సదుపాయాలను చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈక్వెడార్ 

ఈక్వెడార్ ప్లేయర్లకు తమ దేశం ఫేమస్ అరిటిపళ్ళు ప్రతిరోజూ భోజంలో కావాలట. రోజుకు ఒకటో, రెండో కదా పోనీలే తెప్పిద్దాములే అని హోటల్ ఓనర్స్ అనుకునేలోపే…ఈక్వెడార్ ఆటగాళ్ళు మరో కండీషన్ పెడుతున్నారు. రోజూ ప్రతీ ఆటగాడికీ ఓక్కో బాస్కెట్ అరిటిపళ్ళు కావాలని డిమాండ్ చేస్తున్నారట.

ఆస్ట్రేలియా

ఈ దేశం ఆటగాళ్ళ మోస్ట్ హెల్తీయెస్ట్ ఫుడ్ మెనూలో ఉండాలట. రెడ్ మీట్, ఫిష్, చికెన్ లతో చేసిన భోజనం రోజూ తప్పనిసరిగా ఉండాలని వీరి డిమాండ్.

ఫ్రాన్స్…

ఫ్రెంచ్ ఆటగాళ్ళకు ఏం పెట్టినా పర్వాలేదు కానీ…నానెవెజ్ మాత్రం హలాల్ చేసినదే అయి ఉండాలని కండిషన్ పెట్టారుట. ఎందుకంటే ఫ్రాన్స్ ఆటగాళ్ళల్లో ఎక్కువ మంది ముస్లిమ్ లు ఉన్నారట మరి.

ఇంగ్లండ్

యాషెస్ సిరీస్ టైమ్ లో 82 పేజీల మెనూను ఇచ్చారు ఇంగ్లండ్ క్రికెట్ ప్లేయర్స్. అయితే ఫుట్ బాల్ ప్లేయర్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా మెనూ లో ఏం ఉన్నా బుద్ధిగా తింటామని చెబుతున్నారు. కాకపోతే తమ టీమ్ ఉపయోగించుకోవడానికి మాత్రం సెపరేట్ గా మూడు రెస్టారెంట్లు కావాలని సింపుల్ గా అడిగారట.

బోస్నియా

వీళ్ళు అందరికన్నా విచిత్రమైన కోరిక కోరారని చెబుతున్నారు హోటల్ మేనేజ్ మెంట్. ఈ దేశం ఆటగాళ్ళు డైనింగ్ హాల్ మధ్యలో సౌండ్ ఫ్రూఫ్ స్క్రీన్ ఏర్పాటు చేయాలని కోరారుట. అలా అయితే ఆటగాళ్ళంతా ఒకవైపు, కోచింగ్ స్టాఫ్తా ఒకవైపు కూర్చుని భోంచేయవచ్చని…అప్పుడు తాము ఎంత గోల చేసినా, ఏం చెప్పుకున్నా పర్వాలేదని చెబుతున్నారు.

యునైటెడ్ స్టేట్స్

అమెరికన్లకు మాత్రం భోజనం తర్వాత తప్పనిసరిగా తాజా పళ్ళు, హనీ కేక్ ఉండాలని చెబుతున్నారు. అది కూడా వీరు టున్న హోటల్ లో అత్యంత ఫేమస్, ఖరీదైన చెఫ్ అయిన సెర్గీ అరోలాతోనే వండించాలని చెబుతున్నారు. సావో పోలో లో అన్నికంటే ఖరీదైన హోటల్ లో వీరు స్టే చేస్తున్నారు. విచిత్రంగా వీరు ఉంటున్న హోటల్ లో స్విమ్మింగ్ పూల్ నీలి రంగులో కాకుండా ఆరెంజ్ కలర్ లో ఉందిట.

 

 

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy