అజ్మీరా ‘ములుగు’కు వెలుగు చూపిస్తారా?

అడవులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీలు. అటవీ గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తామని హామిలు గుప్పించిన నేతలు. అయినా సరే ఆదివాసీలు అంధకారంలోనే ఉన్నారు. అభివృద్ధి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇదీ వరంగల్ జిల్లాలోని ములుగు సెగ్మెంట్ ఇంట్రడక్షన్. మౌలిక సదుపాయాల సంగతి దేవుడెరుగు… కనీస సదుపాయాలూ సమకూర్చుకోలేకపోయింది ములుగు సెగ్మెంట్.

  • ములుగు నియోజక వర్గంలో గోవిందరావుపేట, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, తాడ్వాయి, ములుగు మండలాలున్నాయి.
  • 2009 డీ లిమిటేషన్ లో నర్సంపేటలోని కొత్తగూడ మండలాన్ని ములుగులో చేర్చారు.
  • అదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉండటంతో ఈ సెగ్మెంట్ ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు.
  • ములుగు నియోజకవర్గంగా ఏర్పడ్డ నాటి నుంచి 14సార్లు ఎన్నికలు జరిగాయి.
  • కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఏడుసార్లు, టీడీపీ నాలుగుసార్లు,  పీడీఎఫ్ కు రెండు సార్లు ఓటర్లు పట్టం కట్టారు.
  • ఈ సెగ్మెంట్ నుంచి  మూడుసార్లు గెలిచిన  జగన్నాయక్ మంత్రి పదవి చేపట్టారు.
  • టీడీపీ నుంచి గెలిచిన అజ్మీరా చంద్ లాల్ ఎన్టీఆర్ కేబినేట్ లో మంత్రిగా పనిచేశారు.
  • ములుగు సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య లక్షా 77 వేల 214.
  • మహిళా ఓటర్లు 89 వేల 112 మంది.
  • పురుష ఓటర్లు 88 వేల 102 మంది.
  • 1952లో ములుగు నియోజక వర్గం ఏర్పాటైంది.

…………………………

  • 1952లో పీడీఎఫ్ అభ్యర్థి హన్మంతరావు గెలిచారు.
  • 1957లో పీడీఎఫ్ నుంచే రాజేశ్వర్ రావు గెలుపొందారు.
  • 1962లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.కృష్ణయ్య విజయం సాధించారు.
  • 1967లో ఇండిపెండెంట్ గా, 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి సంతోష్ చక్రవర్తి రెండుసార్లు గెలుపొందారు.
  • 1978లో కాంగ్రెస్ నుంచి జగన్నాయక్ గెలుపొందారు.
  • 1983లో కాంగ్రెస్ అభ్యర్థి జగన్నాయక్ విజయం సాదించారు.
  • 1985లో టిడిపి అభ్యర్థి అజ్మీరా చంద్ లాల్ విజయం సాధించారు.
  • 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్నాయక్ గెలిచారు.
  • 1994లో టిడిపికి చెందిన చంద్ లాల్ విజయం సాధించారు.
  • 1996లో ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చర్ప బోజరావు గెలుపొందారు.
  • 1999, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య గెలుపొందారు.
  • 2009లో టీడీపీ అభ్యర్ధి సీతక్క విజయం సాధించారు.
    ……………………….

దశాబ్దాలుగా అభివృద్ధి నోచుకోలేదు ములుగు సెగ్మెంట్. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉండటంతో అమాయకుల్ని చేసి ఆడుకున్నారు నేతలు. ఇప్పటికీ విద్య, వైద్యం సదుపాయాలకు దూరంగా ఉన్న తండాలు, గ్రామాలు చాలానే.

  • కాకతీయుల కాలం నాటి రామప్పచెరువు, దేవాలయాలతో పాటు చారిత్రక కట్టడాలు చాలానే ఉన్నాయి.
  • పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఆదాయానికి కొరత ఉండదన్నది స్థానికుల వాదన.
  • కానీ పాలకుల నిర్లక్ష్యం ములుగుకు శాపంగా మారింది.

………………………..

గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి సీతక్క ఎన్నో హామీలిచ్చారు. పదవిలోకొచ్చారు. కానీ చేసిన అభివృద్ధి అంతంతమాత్రమే. అయితే, నమ్మి ఓటేసిన జనానికి చాలా సేవ చేశానంటున్నారు సీతక్క.

  • అయితే సీతక్క చేసిన అభివృద్ధి ప్రజల హృదయాలను గెలుచుకోలేకపోయింది.
  • అన్ని తెలంగాణ జిల్లాల్లాగానే ఇక్కడ కూడా సెంటిమెంటే గెలిచింది.

  • టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అజ్మీరా చందూలాల్ ను గెలిపించారు ఇక్కడి గిరిజనులు.

  • కాంగ్రెస్ అభ్యర్ధి పొదెం వీరయ్యపై 16314 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు చందూలాల్.

……………………..

  • నియోజక వర్గంలో ప్లోరైడ్ సమస్య ఇప్పటికీ పరిష్కాం కాలేదు.
  •  పెండింగ్ లో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయి.
  • ఎక్కడ చూసినా గతుకుల రోడ్లు దర్శనమిస్తున్నాయి.
  • చాలా ఊళ్లు, తండాలు విద్య, వైద్యం లాంటి కనీస సదుపాయాలకు దూరంగా ఉన్నాయి.
  • ములుగు లేదా ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉంది.

తెలంగాణ సెంటిమెంట్ తో ఆదివాసీలు ఓట్లను గెల్చుకున్న అజ్మీరా చందూలాల్ పైన సమస్యలను ఎంత వరకు తీరుస్తారో చూడాలి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy