వెళ్లి రండి సార్ : కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

ktrమంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జర్మనీలో పర్యటించాలని మంత్రి కేటీఆర్ కు ఆ దేశం నుంచి పిలుపు వచ్చింది. జూన్ 26న బెర్లిన్లో జరిగే వరల్డ్ ఫుడ్ కన్వేన్షన్ కు హాజరుకావాలని కోరింది ఇండో జర్మన్ సహకార విత్తనరంగ సంస్థ. అక్కడి విత్తన రంగంపై అధ్యయనం చేయాలని మంత్రికి లేఖ రాసింది.  జర్మనీలో అధ్యయనానికి రావాలని ఇండో -జర్మన్ సహకార విత్తనరంగ సంస్థ ఇన్విటేషన్ పంపించింది.  గతంతో ఒకసారి జర్మనీలో పర్యటించాల్సిందిగా కోరినప్పటికీ.. బీజీ షెడ్యూల్ వల్ల వెళ్లలేకపోయారు మంత్రి. ఈసారి తప్పకుండా జర్మనీకి రావాలని కోరింది విత్తన ఉత్పత్తి అభివృద్ది ఇంప్లీమెంట్ ఏజెన్సీ.

జూన్ 25 నుంచి 27 వరకు జర్మనీ పర్యటనలో భాగంగా  విత్తన రంగంపై అధ్యయనం చేయాలని రిక్వెస్ట్ చేసింది ఏడీటీ ప్రాజెక్ట్. అక్కడి విత్తనోత్పత్తి కేంద్రాల్లో పర్యటించేందుకు అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తామని మంత్రికి వివరించింది. ఈ అధ్యయనం తెలంగాణలో విత్తణ పార్కు ఏర్పాటుకు ఉపయోగపడుతుందని తెలిపింది. జూన్ నాలుగో వారంలో జర్మనీలో పర్యటించి.. 26న బెర్లిన్లో జరిగే వరల్డ్ ఫుడ్ కన్వేన్షన్ కు హాజరుకావాలని కోరింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy