వేగంగా విభజన ప్రక్రియ

download (1)
తెలంగాణ విభజన పక్రియ స్పీడ్ అందుకుంది. జూన్ 2లోగా అన్ని శాఖలను విభజించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్ తరహాలోనే… విభజన ప్రకియ పూర్తి చేయడానికి 60 రోజుల టైం కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి. అన్ని శాఖలకు టైం టేబుల్ ను పంపించారు. ఏ శాఖ ఏ తేదీలోగా విభజన పనిని పూర్తి చేయాలనేది వివరించారు.ఈ నెల 15వ తేదీలోగా ఫైళ్ల విభజన జరగాలని అధికారులను ఆదేశించారు. రికార్డు రూమ్స్ లో ఫైళ్లను కూడా ప్రాంతాల వారీగా విభజించాలని స్పష్టం చేశారు. అంతేకాదు ఒక్కో ఫైలును మూడు సెట్లు చొప్పున జిరాక్స్ తీయాలని స్పష్టం చేశారు.. రెవెన్యూ, పంచాయతీరాజ్, సాగునీటి, సాధారణ పరిపాలన, రహదారులు-భవనాలు వంటి శాఖల్లో లక్షల సంఖ్యలో ఫైళ్లు, జిరాక్స్ తీయాల్సి ఉంది. దీంతో ప్రైవేటు యంత్రాలను అద్దెకు తేవాలని నిర్ణయించారు. సీఎస్ నిర్ణయంతో రెగ్యూలర్ గా జరగాల్సిన పనులను పక్కన పెట్టిన అధికారులు….విభజన పనిని మాత్రమే చేస్తున్నారు.రాష్ట్ర విభజన అంశాలను వేగవంతం చేయడానికి వీలుగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాన్ని పటిష్టం చేశారు. ఈ విభాగంలో తెలంగాణకు, సీమాంధ్రకు చెందిన ఐఏఎస్ లైన రామకృష్ణారావు, బి.వెంకటేశంతో పాటు ఇతర రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ను నియమించారు. అలాగే ప్రస్తుతం ఈ విభాగంలో ఒక సెక్షన్ మాత్రమే ఉండగా అదనంగా మరో రెండు సెక్షన్లను, సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.
మొత్తానికి 60 రోజుల్లోగా పనిపూర్తి చేయాలని సీఎస్ ఆదేశించడంతో పనులన్ని చకచక నడుస్తున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy