వేడుక చూద్దాం రారండి అంటున్న చైతూ- ర‌కుల్‌

nagసోగ్గాడే చిన్ని నాయనా లాంటి కుటుంబకథా చిత్రంతో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ కురుసాల. మ‌ళ్లీ అక్కినేని వార‌సుడితో రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు క‌ళ్యాణ్‌. నాగ‌చైతన్య ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న ఈ చిత్రం సోగ్గాడే చిన్నినాయ‌న త‌ర‌హాలో మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టెయిన‌ర్‌గా రూపుదిద్దుకుంటోంది. రాక్‌స్టార్ దేవీశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ఆదివారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో చైతూ న్యూలుక్‌లో క‌నిపిస్తున్నాడు. త్వ‌ర‌లోనే రారండోయ్ వేడుక చూద్దాం పాట‌లు కూడా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం తెలిపింది. అక్కినేని నాగార్జున అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం మే 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy