వేరే దేశం తరపున క్రికెట్ ఆడుతా: శ్రీశాంత్

sreesanthటీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. వేరొక దేశం తరుపున క్రికెట్ ఆడే యోచన చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా శ్రీశాంత్ పట్ల BCCI వ్యవహరిస్తున్న తీరుపై అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇకపై టీమిండియా ఆడే అవకాశం లేకపోవడంతోనే శ్రీశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దుబాయ్‌లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌కు హాజరైన శ్రీశాంత్ తాను వేరే దేశానికి ప్రాతినిథ్యం వహించాలనుకున్నట్లు ఆసియా నెట్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో స్పష్టం చేశాడు. నన్ను బీసీసీఐ నిషేధించింది… కానీ ఐసీసీ కాదని తెలిపాడు. భారత్ తరుపున క్రికెట్ ఆడలేనప్పుడు.. వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా..అని అన్నాడు శ్రీశాంత్.

తనకు ఇంకా ఎంతో కెరీర్ ఉందని… ఆరేళ్లుగా పైగా క్రికెట్ ఆడే సత్తా ఉందన్నాడు. ఒక వ్యక్తిగా క్రికెట్ అంటే ఇష్టమని… అందుకే క్రికెట్నే ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు శ్రీశాంత్. బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్ సంస్థ అని… అలానే వేరే దేశానికి క్రికెట్ ఆడతానని తెలిపాడు. తనపై నిషేధం కొనసాగించే నిర్ణయం బీసీసీఐకే వదిలేశానని స్పష్టం చేశాడు శ్రీశాంత్.

2013లో శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో BCCI అతడిపై నిషేధం విధించింది. అయితే బీసీసీఐ నిషేధాన్ని కేరళ హైకోర్టులో సవాల్ చేయగా… ఆగస్టు 7న సింగిల్‌ జడ్జి బెంచ్‌ అతడిని నిర్దోషిగా తేల్చింది. అయితే దీనిపై BCCI మళ్లీ కేరళ హైకోర్టుకు వెళ్లింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy