వేలానికి ఐన్‌స్టీన్‌ ఫొటో 

ienప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బెర్ట్‌ ఐన్‌స్టీన్‌కు చెందిన అరుదైన ఫొటోను అమెరికా సంస్థ ‘నేట్‌డీ శాండెర్స్‌’ వేలం వేయనుంది. ఈ ఫొటోను 1951 మార్చి 14న ఐన్‌స్టీన్‌ 72వ పుట్టినరోజు సమయంలో తీశారు. దీనిలో ఆయన నాలుకను బయటపెట్టి సరదాగా కనిపిస్తారు. చెక్కుచెదరని ఈ చిత్రం వేలంలో రూ.64.36 లక్షలు వరకూ ధర పలుకుతుందని అంచనా. అయితే మొదటిసారిగా ప్రచురించినప్పుడు ఐన్‌స్టీన్‌ చాలా సంతోషపడ్డారట. అంతేకాదు కొన్ని ఫొటోలను తన అత్యంత సన్నిహితులకు పంపాలని కూడా కోరారట. తాజా చిత్రంపై ఎలాంటి కత్తిరింపులూ పడలేదు. దీనిలో ఆయన పక్కన ఆనాటి ప్రిన్సెటన్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి ఫ్రాంక్‌ ఎడిలోట్‌, ఎడిలోట్‌ సతీమణి కనిపిస్తున్నారు. చిత్రం ఎడమవైపు భాగంలో ఐన్‌స్టీన్‌ సంతకం చేయడం దీని ప్రత్యేకత.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy