వేసవికి స్పెషల్ ట్రైన్స్

indian railways trainఎండాకాలం వస్తే..స్కూళ్లకు, కాలేజీలకు హాలిడేస్ వస్తాయి. దీంతో పాటు సమ్మర్ వెకేషన్ కు ఎంజాయ్ చేసేందుకు టూర్లు ప్లాన్ చేస్తారు చాలా మంది. దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు దాదాపుగా రైలు ప్రయాణాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దీంతో ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. పలు ప్రాంతాలకు 100 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ప్రత్యేక రైళ్లు-రూట్లు:

సికింద్రాబాద్‌-రక్సౌల్‌: జూలై 3, 10, 17, 24, 31 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 9:40కి బయలుదేరి, తిరుగు ప్రయాణంలో 6, 13, 20, 27, ఆగస్టు 3న మధ్యాహ్నం 12:45కి బయలుదేరుతాయి.
హైదరాబాద్‌-రక్సౌల్‌: జూలై 5, 12, 19, 26 తేదీలలో రాత్రి 9:50కి బయలుదేరి తిరుగు ప్రయాణంలో జూలై 8, 15, 22, 29 తేదీలలో మధ్యాహ్నం 1:30కి రక్సౌల్‌ నుంచి బయలుదేరుతాయి.
సికింద్రాబాద్‌- బరౌణి: జూలై 1, 8, 15, 22, 29 తేదీలలో రాత్రి 10 గంటలకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో జూలై 4, 11, 18, 25న బరౌణి నుంచి బయలుదేరుతుంది.
సికింద్రాబాద్‌-విజయవాడ: జూలై 1, 8, 15, 22, 29 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 5:30 బయలుదేరి తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి సాయంత్రం 5:30 బయలుదేరుతుంది.
సికింద్రాబాద్‌-గౌహతి: జూలై 6, 13, 20, 27 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి ఉద యం 7:30కి బయలుదేరి తిరుగు ప్రయాణంలో జూలై 9, 16, 23, 30 తేదీలలో గువాహటి నుంచి బయలుదేరుతుంది.
సికింద్రాబాద్‌- దర్బంగా: జూలై 3, 7, 10, 14, 17, 21, 24, 28, 31 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి, తిరుగు ప్రయాణంలో జూలై 6, 10, 13, 17, 20, 24, 27, 31 తేదీలలో దర్బంగా నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది.
కాకినాడ టౌన్‌-రాయ్‌చూర్‌ స్పెషల్‌: మే 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29, 31 తేదీలలో, అలాగే జూన్‌ 5, 7, 12, 14, 19, 21, 26, 28 తేదీలలో కాకినాడ నుంచి మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి. తిరుగు ప్రయాణంలో మే 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీలలో, అలాగే జూన్‌ 1, 6, 8, 13, 15, 20, 22, 27, 29 తేదీలలో రాయ్‌చూర్‌ నుంచి బయలుదేరుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy