ఉత్తర ద్వార దర్శనం.. ముక్తికి మార్గం

vaikunthaవైకుంఠ ఏకాదశి…. ముక్కోటి ఏకాదశి….పేరు ఏదైనా కొలిచే స్వామి ఒక్కరే. సనాతన హిందూ సంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన ముక్కోటి దేవతలు స్వామి వారిని దర్శించుకొని తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

ముక్కోటి ఏకాదశి… హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఏడాదిలో 26 ఏకాదశిలు వచ్చినా… ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజున ముక్కోటి దేవతలు ఒక్కచోట చేరి శ్రీమహా విష్ణువును దర్శించుకొని తరిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనికూడా పేరొచ్చినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

Uttara dwara darshanamఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని భక్తుల నమ్మకం. ఇవాళ సూర్యోదయానికి ముందే నదీ స్నాన మాచరించి శ్రీహరిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. అందుకే వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మరు జన్మ ఉండదని, కోటి యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

పురాణాల్లోకి వెళితే…. ఇదే రోజు క్షీరసాగర మథనం కూడా జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో విషం, అమృతం రెండూ పుట్టాయని… విషాన్ని స్వీకరించిన శివుడు దాన్ని గొంతులో దాచుకున్నాడని అందుకే ఆయనకు గరళ కంఠుడిగా పేరొచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ రోజునే భగవద్గీత జయంతిగా కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. వేద పారాయణం, ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఏకాదశి రోజు ఉపవాసాలు చేసి ద్వాదశి రోజు అన్నదానం చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy