వైద్య విద్య మరింత భారం

medical-students-telanganaప్రైవేట్‌ వైద్య కాలేజీల్లో ఫీజులు 5శాతం పెరిగాయి. గురువారం (జులై 20) వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఫీజుల పెంపు ఉత్తర్వులను జారీ చేశారు. దాంతోపాటు మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ కోటా సీట్ల కోసం ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ హెల్త్‌ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో అన్నిరకాల సీట్లను ప్రభుత్వమే భర్తీచేయనుంది. ప్రస్తుతం కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 22నుంచి ఈ సీట్లకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తారు. బీ, సీ కేటగిరీ సీట్లకు ఈనెల 22 నుంచి 28 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీ, సీ కేటగిరి డెంటల్‌ సీట్లకుకూడా 5 శాతం ఫీజులు పెంచారు. మైనారిటీ కాలేజీల్లో ఫీజులు పెంచలేదు. ప్రైవేట్‌, మైనారిటీ కాలేజీల యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రెండుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. సీట్లు మిగిలితే చివరి అవకాశంగా మాప్ అప్ పద్ధతిన మూడో విడత ప్రవేశాలు కల్పించాలని.. అప్పటికీ సీట్లు మిగిలితే వాటిని భర్తీ అవకాశాన్నివైద్య కాలేజీలకే వదిలేస్తారు. అయితే నిర్దేశిత గడువు తర్వాత జరిపే ప్రవేశాలు చెల్లుబాటు కావని తెలిపింది.

ప్రైవేట్ వైద్య కాలేజీల్లో ఫీజులు ఏడాదికి

కేటగిరి సీట్లు                      ప్రస్తుత ఫీజు               పెరిగిన ఫీజు

కన్వీనర్(50%)                       60,000                           60,000

మేనేజ్ మెంట్(35%)              11,00,000                     11,55,000

NRI(15%)                               22,00,000                     23,10,000

 

ప్రైవేట్ దంత వైద్య కలేజీల్లో ఫీజులు ఏడాదికి

కేటగిరి సీట్లు                      ప్రస్తుత ఫీజు               పెరిగిన ఫీజు

కన్వీనర్(50%)                45,000                  45,000

మేనేజ్ మెంట్(35%)           4,00,000                 4,20,000

NRI(15%)                          5,00,000                5,25,000

వైద్య విద్యలో అందుబాటులో ఉన్న సీట్లు

ఎంబీబీఎస్ లో:

మొత్త సీట్లు-3,150

కన్వీనర్ కోటాలో-2,100

ఇందులో 200 మైనార్టీ సీట్లు(50 సీట్లు మైనార్టీ బాలికలకు)

ప్రైవేట్ కాలేజీల్లో…

బి కేటగిరీలో-592

సి కేటగిరీలో-258

మైనార్టీ కాలేజీల్లో….

బి కేటగిరీలో-139( ఇందులో35 మైనార్టీ బాలికలకు)

సి కేటగిరీలో-61(15 మైనార్టీ బాలికలకు)

బీడీఎస్ లో..

కన్వీనర్ కోటా సీట్లు-606

బి కేటగిరీ సీట్లు-350

సి కేటగిరీ సీట్లు-150

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy