వైరల్ ఫొటో : అమ్మకెన్ని పనులో..!?

 ఇల్లు చక్కబెట్టాలి. పిల్లల ఆలనాపాలనా చూడాలి. భర్తకు సపర్యలు చేయాలి. ఆఫీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేయాలి. ఒక అమ్మకు (ఉద్యోగం చేసేవారికి) రోజూ ఎదురయ్యే సవాళ్లే ఇవి. ఆ పనుల్లో పడితే వారికి టైం ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఒక్కోసారి మల్టీ టాస్కింగ్ (ఒకేసారి చాలా పనులు చేయడం) చేయాల్సి రావొచ్చు. ఇదిగో ఈ ఫొటోలో అమ్మను చూడండి.. ఒక భుజంపై బుడ్డోణ్ని నిద్రపుచ్చడం ఓవైపు. ఇంకో వైపు ఫోన్లో క్లయింట్ తో చర్చలు. ఇంకో పక్క ఫైల్స్​లో రాతలు. ఒకేసారి మూడు పనులు చేసేస్తోంది. ఆమెను గమనించిన కంపెనీ ఓనర్ ఫొటో తీసి ఫేస్ బుక్ లో షేర్ చేసే సరికి.. వర్కింగ్ మదర్స్​ గుండెలను తాకిందీ ఫొటో.

ఆ ఫొటోను షేర్ల మీద షేర్లు చేయడంతో వైరల్ అయింది. ఆ ఫొటోలో ఉన్నామె పేరు మెలొడీ బ్లాక్ వెల్. వయసు 27 ఏళ్లు. ఎంచక్కా నిద్రపోతున్న ఆ బుడతడి పేరు నోరా జో. అమెరికాలోని టెన్నెసీలోగల మేరీ లాండ్ ఫార్మ్స్ షిరోప్రాక్టిక్ కంపెనీలో ఉద్యోగి. ఆమె ఒక్కతే కాదు.. ఆ కంపెనీలో పనిచేసే మహిళలంతా తమ పిల్లలను ఆఫీసుకు తీసుకొచ్చి లాలించే వెసులుబాటు కల్పించింది ఆ కంపెనీ ఓనర్ డాక్టర్ ఎలిజబెత్ బేకర్ . ఇంతకీ షిరోప్రాక్టీస్ అంటే.. ఓ వ్యక్తి రోగాన్ని గుర్తించాక మందులను రాసిచ్చే ఉద్యోగమన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఓ ఫార్మాసిస్ట్​.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy