వైరల్ వీడియో : సింగిల్ హ్యాండ్ తో కత్రినా పుష్ అప్స్

katrina-kaif-24717బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ఫ‌న్నీ వీడియోల‌తో త‌న ఫ్యాన్స్‌ను ఎప్పుడూ థ్రిల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో కూడా అంద‌ర్నీ స్ట‌న్ చేస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఈ వీడియో చూస్తే వామ్మో ఇన్ని డిప్స్ కొడుతుందా అని ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ప్ర‌స్తుతం స‌ల్మాన్‌తో టైగ‌ర్ జిందా హై ఫిల్మ్‌లో న‌టిస్తున్న‌ది. ఆ సినిమా మొరాకోలో షూటింగ్ జ‌రుగుతున్న‌ది. అయితే ఈ సంద‌ర్భంగా ఓ వెరైటీ ప్రాంక్ వీడియోను పోస్ట్ చేసింది బాలీవుడ్ క్యూట్ లేడీ కత్రినా . ఆ వీడియోలో తెగ పుష్ అప్స్ చేస్తున్న‌ట్లు ఆమె చూపించింది. కానీ నిజానికి ఆమె అన్ని డిప్స్ చేస్తుందా అని అనిపిస్తుందా. ఏ మాత్రం క‌ష్టప‌డ‌కుండానే ఆమె ఈజీగా పుష్ అప్స్ చేసేసింది. కానీ ఈ వీడియో చూస్తే, ఆమె అంత ఈజీగా డిప్స్ ఎలా చేసిందో తెలుస్తుంది. వాచ్ ఇట్.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy