వోడాఫోన్ రెడ్ అన్ లిమిటెడ్ ఆఫర్

vadaphoneరిలయన్స్ జియో ఉచిత ఆఫర్లు, ఎయిర్ టెల్  అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్లతో ఇతర  టెల్కోల్లో గుబులు మొదలైంది.  అదే బాటలో ఇప్పుడు వొడాఫోన్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు.. ప్రస్తుతం అమల్లో ఉన్న వోడాఫోన్ రెడ్ ప్లాన్స్ మూడింటినీ ఒకే అఫర్ కింద తీసుకొచ్చింది. రెడె అన్ లిమిటెడ్ పేరుతో.. అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. ఇప్పటివరకు అపరిమిత ఉచిత కాల్స్ రూ 16.99 రీచార్జ్ పై అందిస్తోంది. ఇప్పుడు ఈ ఆఫర్లలో మార్పులు చేసి ఫ్రీ కాల్స్, అదనపు డాటాను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ అందించిన సమాచారం  ప్రకారం వొడాఫోన్ రెడ్  పోస్ట్ పెయిడ్  లో ప్లాన్స్ ఇలా ఉన్నాయి.
ప్లాన్ 1
రూ.499 ప్యాక్ లో.. లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1 జీబీ డాటా ఉచితం. 2 జీబీ 4జీ డాటా, 4జీ మొబైల్స్ లో 3 జీబీ డాటా ఉచితం. 100 ఎస్ఎంఎస్ లు ఉచితం.

ప్లాన్ 2

రూ. 699 ప్లాన్ లో లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ అన్ లిమిటెడ్ ఉచితం, 5జీబీ  4జీ  లేదా 2.5జీబీ డాటా ఉచితం. 100 ఎస్ఎంఎస్ లు ఫ్రీ.

ప్లాన్ 3

రూ.399 ఎంపిక చేసిన ప్రాంతాల్లో అన్ లిమిటెడ్ కాలింగ్.. 1 జీబీ 4 జీ డాటా తోపాటు 100 ఎస్ఎంఎస్ లు అదనం. పోస్ట్ పెయిడ్ వినియోగదారులు, ఎంటర్‌ప్రైజ్ ఖాతాదారుల కనెక్షన్ల సంఖ్యను మరింత పెంచుకునే ప్రణాళికలో గతంలో వొడాఫోన్ రెడ్’, ‘వొడాఫోన్ రెడ్‌ఫర్ బిజినెస్’ పేర్లతో  ఆల్ ఇన్ వన్ పథకాలను మార్కెట్లోకి తీసుకువచ్చిన  సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పోటీలో వినియోగదారులను నిలబెట్టుకునే క్రమంలో ఈ సరికొత్త ఆఫర్స్ తీసుకొచ్చింది కంపెనీ.

One Response to వోడాఫోన్ రెడ్ అన్ లిమిటెడ్ ఆఫర్

  1. Anonymous says:

    Don’t compare this plane with Jio planes….jio unique

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.