వ్యర్ధాలపై GHMC వార్నింగ్: కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటులో హోటల్, రెస్టారెంట్ల ఓనర్స్

హైదరాబాద్ సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ లో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలపై దృష్టి పెట్టింది GHMC. కంపోస్ట్ యూనిట్ల ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఆర్డర్స్ ను లైట్ తీసుకుంటే.. చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. బల్దియా వార్నింగ్ తో కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటులో పడ్డారు ఓనర్స్.

గ్రేటర్ సిటీలో హోటల్స్, రెస్టారెంట్స్, బాంకెట్, ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలకు.. కంపోస్ట్ యూనిట్లపై అవర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించింది బల్దియా. పీపుల్స్ ప్లాజాలో కంపోస్ట్ యూనిట్లకు సంబంధించి ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసింది. దీంతో నగరంలోని చిన్న, పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ యాజమానులు ఈ స్టాల్స్ ను సందర్శిస్తున్నారు. కంపోస్ట్ యూనిట్ల పనితీరు, రేట్లు అడిగి తెలుసుకున్నారు.

2016 SWM నిబంధనల ప్రకారం రోజుకు 100 కిలోల కన్నా అధికంగా చెత్త ఉత్పత్తి చేసే వాటిని బల్క్ గార్బెజ్ జనరేటర్లుగా గుర్తించింది బల్ధియా. ఇప్పటికే సిటీలో 300 వరకు ప్రధాన  బల్క్ గార్బేజ్ కేంద్రాలను గుర్తించింది. బల్క్ గార్బేజ్ కి ప్రతి కిలోకు 2.89 పైసలు యూజర్ చార్జీల కింద వసూలు చేస్తోంది బల్దియా. ఒక్కో హోటల్ ప్రతి ఏటా దాదాపు లక్ష రూపాయల వరకు చెల్లిస్తున్నాయి. అయితే ఈ … కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే గార్బేజ్ ఖర్చు తగ్గుతుందంటున్నారు అధికారులు.

పీపుల్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ యూనిట్ల ప్రదర్శనకు మంచి రెస్పాన్స్  వస్తోందంటున్నారు నిర్వాహకులు. కంపోస్ట్ యూనిట్ల ధరలు, పనితీరు అడిగి తెలుసుకొని.. ఆర్డర్ చేస్తున్నారని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని వందల సంఖ్యలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ నుంచి రోజుకు  వేల టన్నుల వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయి. తప్పనిసరిగా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని GHMC అధికారులు హెచ్చరించారు. లేదంటే వాటర్ కనెక్షన్, ట్రేండ్ లైసెన్సులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బల్దియా ఇచ్చిన వార్నింగ్ తో హోటల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు దిగొచ్చాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy