
ఒప్పందాల తర్వాత.. సంయుక్త ప్రకటన చేశారు నేతలు. ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరించడం.. రెండు దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహం.. అభివృద్ధిలో భాగస్వామ్యం పెంచుకోవడం తమ ప్రాధాన్యతలను ప్రధాని మోడీ చెప్పారు. కెన్యా భారత్ దౌత్య సంబంధాలతో.. హిందూ మహాసముద్రం, ఆసియా పసిఫిక్ రీజియన్ లో రెండు దేశాల స్థిరత్వం, భద్రత మరింత పటిష్టమవుతాయని చెప్పారు. అగ్రికల్చరల్ మెకనైజేషన్ కోసం కెన్యాకు దశలవారీగా వంద మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయం ఇచ్చేందుకు భారత్ ఓకే చెప్పింది. టెర్రరిజంపై ఉమ్మడి పోరాటం, కౌంటర్ నార్కోటిక్స్, మానవ అక్రమ రవాణా, ఆరోగ్యం, డిజిటల్, క్యాష్ లెస్ ఎకానమీ, ఈ గవర్నెన్స్, పప్పు ఉత్పత్తులు, క్రీడలు, పునరుత్పాదక ఇంధన శక్తులు లాంటి అంశాలపై భారత్, కెన్యా చర్చించాయి. అంతకుముందే.. కెన్యా అధ్యక్షుడు కెన్యట్టా.. రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి అన్సారీలతోనూ భేటీ అయ్యారు. రేపు ఢిల్లీలోని బిజినెస్ ఫోరమ్ లో ఆయన పాల్గొనున్నారు.