వ్యవసాయానికి తొమ్మిది గంటల పవర్ సరఫరా

telangana-secretariatవచ్చే ఏడాది మార్చి నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. అవసరమైతే అదనంగా విద్యుత్ కొనుగోలు చేసేందుకు రెడీ అవుతోంది. రైతులకు ఇచ్చిన మాట నెలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ కోసం 2 వేల 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కలేశారు విద్యుత్ అధికారులు. పవర్ ప్రొడక్షన్ లేకపోయినా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అదనపు విద్యుత్ కొనుగోలుకు సిద్ధమవుతున్నారు అధికారులు. తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరాకు 8వేల930 మెగావాట్ల పవర్ అవసరమంటున్నారు అధికారులు. ప్రస్తుతం సర్కార్  2700 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తోంది.  ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు విద్యుత్తు సప్లై చేయాలంటే… మరో 6 వేల 200 మెగావాట్ల విద్యుత్తు అవసరమంటున్నారు. నాగార్జునసాగర్ లో 3వేల మెగావాట్ల ఉత్పత్తికి గాను…ప్రస్తుతం 140 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తి కానున్న సింగరేణి పవర్ ప్లాంట్స్ నుంచి 12 వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి  కానుంది. భూపాలపల్లి పవర్ ప్లాంట్ లో 600 మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తికి అవకాశముంది. ఇప్పటి వరకు పరిశ్రమలకు, గృహ అవసరాలకు సక్సెస్ ఫుల్ గా విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం… రైతులకు తొమ్మిది గంటలు విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని దారులు వెతుకుతోంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy