వ్యవసాయ రంగానికి శాస్త్రవేత్తల పరిశోధనలు అవసరం: కేటీఆర్

ktrరాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ తార్నాకలోని ఐఐసీటీలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు యువ శాస్త్రవేత్తలకు యెంగ్‌ సైంటిస్ట్స్‌ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగానే జరుగుతున్నాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక ఫలాలు సామాన్య ప్రజలకు అందాలన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలు వ్యవసాయ రంగానికి ఎంతో అవసరమన్నారు. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు.  హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇస్రో 100 ఉపగ్రహాలకు పైగా ఒకేసారి నింగిలోకి పంపటం ఎంతో గర్వకారణమన్నారు మంత్రి కేటీర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy