శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నం.1 ర్యాంక్

Rajiv Gandhi International airportహైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అరుదైన గౌరవం దక్కింది. 2016లో ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించినందుకు (5-15 మిలియన్ల కేటగిరీ) ప్రపంచంలోనే నంబర్‌‌వన్‌ స్థానం దక్కింది. ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ACI) విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో ఈ గుర్తింపు లభించినట్టు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (GHIAL) సంస్థ బుధవారం (అక్టోబర్ 18) తెలిపింది. మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌లో మంగళవారం(అక్టోబర్-17) జరిగిన సదస్సులో ఈ అవార్డును ఏసీఐ డైరెక్టర్‌ అంగేలా గిట్టెన్స్‌ నుంచి జీహెచ్‌ఐఏఎల్‌ సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ అందుకున్నారు.

ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ క్వాలటీ సర్వే ప్రకారం.. రాజీవ్ గాంధీ విమానాశ్రయం తన స్కోర్‌ను క్రమంగా పెంచుకుంది. 2009లో ఈ స్కోర్‌ 4.4 ఉండగా.. 2016 వరకు 4.9కి చేరింది. RGIAకు తాజాగా ఈ అవార్డు దక్కటంపై ఎస్‌జీకే కిశోర్‌ ఆనందం వ్యక్తంచేశారు. ఈ అవార్డుతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మరింత పెరుగుతుందన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy