శక్తిమంతమైన శతఘ్ని.. ఆర్మీ చేతికి M777 హొవిట్జర్

ఢిల్లీ : భారత ఆర్మీ అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన శతఘ్ని చేరింది. M777 అల్ట్రా లైట్ హొవిట్జర్ (ULH) ఫిరంగి.. ఆర్మీకి అందింది. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సమక్షంలో M777 అల్ట్రా లైట్ హొవిట్జర్ ఫిరంగిని సైన్యం విజయవంతంగా పరీక్షించింది. అత్యంత ఎత్తైన శిఖరాలపై కూడా మందుగుండ్లను పేల్చగల శక్తిసామర్థ్యాలు M777 అల్ట్రా లైట్ హొవిట్జర్ శతఘ్ని సొంతం.

శుక్రవారం మహారాష్ట్రలోని నాసిక్ లో వీటిని పరీక్షించారు. ఆర్మీ శతఘ్ని దళానికి అందిన కొత్త ఆయుధాల్లో.. M777 అమెరికన్ అల్ట్రా లైట్ హోవిట్జర్స్, కే9 వజ్ర, పేలుడు సామాగ్రి తరలించే కాంపోజిట్ గన్ ట్రాక్టర్ ఉన్నాయి. ఇందులో కే9 వజ్ర-టీ 155ఎంఎం/52.. స్వీయ చోదక శక్తి కలిగిన శతఘ్ని. సౌత్ కొరియా సైన్యంలో ఇది ఒక  ప్రధాన ఆయుధంగా ఉంది. దూరంగా ఉన్న లక్ష్యాలను కే9 వజ్ర టార్గెట్ చేయగలదు.

చాన్నాళ్ల తర్వాత భారత శతఘ్ని దళానికి అందిన శక్తిమంతమైన ఆయుధం ఇది. బ్రిటీషి డిఫెన్స్ మానుఫాక్చరింగ్ కంపెనీ అయిన బీఏఈ సిస్టమ్స్ సంస్థ, ఇండియా లార్సెన్ అండ్ టర్బో(ఎల్ అండ్ టీ) రక్షణ ఆయుధాల తయారీ సంస్థ సంయుక్తంగా M777 అల్ట్రా లైట్ హొవిట్జర్ ను రూపొందించాయి. సెప్టెంబర్ లోనే భారత ఆర్మీకి ఇది అందాల్సి ఉంది. ఐతే.. కొంత ఆలస్యం అయింది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో M777 ను సైనిక, నావికా దళాలు ఉపయోగిస్తున్నాయి. పలు యుద్ధాల్లోనూ ఇవి తమ సత్తా నిరూపించుకున్నాయి. అలాంటి శక్తిమంతమైన శతఘ్ని ఇపుడు భారత సైన్యంలో చేరింది. నాసిక్ లో M777 అల్ట్రా లైట్ హొవిట్జర్ సైనిక విన్యాసాల వీడియోను ఆర్మీ విడుదల చేసింది. ఆ విన్యాసాలను కింద వీడియోలో చూడొచ్చు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy