శబరికి ప్రత్యేక రైళ్లు

Ayyappaశబరి మలై వెళ్ళే స్వాముల కోసం ప్రత్యేక రైళ్ళు నడపనుంది దక్షిణ మధ్య రైల్వే.  అయితే ఈసారి రైల్వే బోర్డ్ గైడ్ లైన్స్ ప్రకారం 30శాతం ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ అదనపు బాదుడు స్వాములకు భారం కానుంది.

 

 

132 సర్వీసులు

ప్రతి ఏడాది శబరికి వెళ్ళే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. ఈ ఏడాది 132 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, కరీంనగర్ నుంచి కొల్లంకు 20 సర్వీసులు ఏర్పాటు చేసింది. ఇవేకాకుండా ఆంధ్రా నుంచి కూడా స్పెషల్ ట్రైన్లను నడపనుంది.

30శాతం అదనపు చార్జీ

ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా.. 30 శాతం ఎక్కువ వసూలు చేస్తోంది రైల్వే శాఖ. స్లీపర్, ఏసీ కోచ్ లలో ఈ ధరలను నిర్ణయించినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువైతే మరిన్ని ట్రైన్లు నడుపుతామని చెప్పారు. మూడేళ్లలో టికెట్ ధరలు మూడింతలు పెరిగాయంటున్నారు భక్తులు. ప్రభుత్వం భక్తులకు రాయితీలు ఇవ్వాల్సింది పోయి.. ఎక్స్ ట్రా ఛార్జీలతో ఆర్ధిక భారాన్ని కలిగిస్తుందంటున్నారు.  ప్రత్యేక రైళ్ళు ఈనెల 15 నుంచే మొదలయ్యాయి. వచ్చే నెల 15 వరకు ఇవి నడుస్తాయి

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy