శబరిమలలో అపచారం

Sabarimala-temple-mastశబరిమలలో ఆదివారం స్వర్ణ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. 1968లో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభానికి.. స్వర్ణతాపడంతో ఇవాళ పునఃప్రతిష్ఠించారు. అప్పట్లో పంచలోహాలతో తొడుగు చేయించారు. 2015లో దీనికి బంగారం రంగును స్ర్పే చేసే సమయంలో దాని చుట్టూ ఉన్న అష్టదిక్పాలకుల ప్రతిమలకు పొరపాటున స్థానభ్రంశం కలిగింది. ఈ నేపథ్యంలో కొత్త ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. వందమందికిపైగా దాతలు ముందుకురాగా.. వారిలో ఐదుగురి పేర్లనే హైకోర్టుకు బోర్డు సమర్పించింది. ఆ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫీనిక్స్ ఇన్ ఫ్రా దక్కించుకుంది.

ఇదిలా ఉండగా… స్వర్ణ ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన కాసేపటికే.. పీఠంపై గుర్తుతెలియని వ్యక్తులు పాదరసం పోసి పరారయ్యారు. ఈ దృశ్యాలు ఆలయ సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి. గుడి మూసిన తర్వాత ధ్వజస్తంభం పీఠంపై పాదరసాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పోశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలయానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy