శరణార్థుల కోసం అమెజాన్ సీఈవో భారీ విరాళం

amazon-ceoఎంత ఎత్తుకు ఎదిగినా… మూలాలను అస్సలు మర్చిపోరు కొందరు. ఆ కోవలోకి వస్తారు ప్రపంచ కుబేరుడు.. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్. అమెరికాకు వచ్చిన తొలి రోజుల్లో ఓ శరణార్థిగా తన తండ్రి కష్టాలు.. గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ కష్టాలే తన తండ్రిని ఓ గొప్ప పౌరుడిగా మార్చాయన్నారు. తాజాగా బిల్ గేట్స్ ను పక్కకు నెట్టేసి వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ గా ఎదిగిన బెజోస్… తన తండ్రిలా అమెరికా వచ్చిన శరణార్థుల కోసం… భారీ విరాళాన్ని ప్రకటించారు. నాన్‌ – ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ దిడ్రీమ్‌.యూఎస్‌కు 33 మిలియన్‌ డాలర్లను (రూ.209కోట్లను)  విరాళంగా అందించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని శరణార్థ విద్యార్థులకు కాలేజీ స్కాలర్‌షిప్‌లుగా అందించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ తెలుపుతూ thedream.us ప్రకటన విడుదల చేసింది. వెయ్యి స్కాలర్‌షిప్‌లకు ఈ డబ్బులను వినియోగించనున్నారు. ఇప్పటివరకు తాము అందుకున్న వాటిలో ఇదే పెద్ద మొత్తమని చెప్పింది.

ఈ సందర్భంగా జెఫ్‌ బెజోస్‌ అమెరికాకు వచ్చిన తొలి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ” నా 16 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న అమెరికా వచ్చారు. ఒకడే ఈ దేశంలోకి అడుగుపెట్టారు. కనీసం ఇంగ్లీష్‌ మాట్లాడటం కూడా రాదు. డెలావేర్‌లో కొన్ని గొప్ప సంస్థల సాయంతో మా నాన్న ఓ గొప్ప పౌరుడిగా ఎదిగారు” అని అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy