శర్వా SSS కాంబో ప్రారంభం

SSSహను రాఘవపూడి డైరెక్షన్ లో యంగ్ హీరో శర్వానంద్ పడిపడి లేచే మనసు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగానే మరో మూవీని మొదలుపెట్టాడు శర్వా.  త‌న 28వ సినిమాగా సుధీర్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లోను ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం (ఏప్రిల్-5) వైజాగ్‌లో మొద‌లైంది. ఈ సందర్భంగా ట్రిపుల్ (SSS) అని ట్విట్ చేశాడు శర్వా. ఈ మూవీలో శర్వా సరసన హ‌లో ఫేం క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఫస్ట్ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్స్ మ‌ధ్య కొన్ని కీల‌క స‌న్నివేశాలు షూట్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా శర్వానంద్ కెరియర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుంద‌ని టీం భావిస్తుంది. ఈ ఇయర్ చివ‌రిలో మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy