శశికళకు ఈసీ నోటీసులు

572220-sasikala-1తమిళనాడులో  పొలిటికల్ డ్రామా  కంటిన్యూ అవుతోంది. శశికళ, పన్నీర్  సెల్వం వర్గాలు  ఎత్తులకు పై ఎత్తులు  వేసుకుంటున్నారు. తాజాగా పన్నీర్ వర్గం సభ్యుడు.. మైత్రేయన్ వేసిన పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని శశికళకు నోటీసులు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్.  ఈనెల 28లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొంది.

రేపు అసెంబ్లీలో  బల పరీక్ష జరగనుంది.  సీఎం పళనిసామి  విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. పన్నీర్ టీమ్  మెంబర్స్ అసెంబ్లీ  స్పీకర్ P.ధనపాల్ ను  కలిశారు. విశ్వాస పరీక్షను  సీక్రెట్ బ్యాలెట్ ఓట్  ద్వారా నిర్వహించాలని  కోరారు. ఎమ్మెల్యేలు  స్వేచ్ఛగా  ఓటు వేసేలా… ఓటింగ్  ప్రాసెస్ అంతా రహస్యంగా  జరిగేలా చర్యలు  తీసుకోవాలని కోరారు.

మరోవైపు అన్నాడీఎంకే  పార్టీ నుంచి ప్రస్తుత సీఎం పళనిసామిని బహిష్కరిచింది పన్నీర్ టీం. ఇదివరకు శశికళను  బహిష్కరించిన సంగతి తెలిసిందే. పార్టీ  నుంచి శశికళను బహిష్కరిస్తున్నట్టు  మధుసూదనన్   ప్రకటన  చేశారు. పార్టీ  ప్రిసీడియం  చైర్మన్ గా ఉన్న మధుసూదనన్… పన్నీర్ సెల్వం  క్యాంప్ లో చేరారు.  దీంతో ఆయన్ని… ప్రిసీడియం  చైర్మన్ పదవి  నుంచి తొలగించారు  శశికళ. ఇప్పుడు  శశికళనే పార్టీ  నుంచి బహిష్కరించారు  మధుసూదనన్. పార్టీ  రాజకీయ కార్యకలాపాలు  నిర్వహించే హక్కు  శశికళకు లేదని… పార్టీ  నిర్వహణ అంతా  ప్రిసీడియం చైర్మన్ అయిన  తన  ఆధీనంలోనే  ఉంటుందన్నారు  మధుసూదనన్. శశికళలతో  పాటు ఆమె  నియమించిన  పార్టీ డిప్యూటీ జనరల్  సెక్రటరీ దినకరన్,  వెంకటేశ్ లను కూడా  బహిష్కరించారు మధుసూదన్.

ఇక శశికళ  వర్గంలోనూ… ముసలం  మొదలైనట్టు  తెలుస్తోంది. కువత్తూర్ లోని  గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఉన్న… 40మంది  ఎమ్మెల్యేలు పళనిసామికి  ఎదురు తిరిగినట్టు  సమాచారం. పళని నాయకత్వం  తమకు ఇష్టంలేదని  వారు తేల్చిచెప్పగా… లోక్ సభ  డిప్యూటీ స్పీకర్  తంబిదురై ఎమ్మెల్యేలను  బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. శశికళపై  ప్రజల్లో వ్యతిరేకత  ఉందని ఎమ్మెల్యేలు  భయపడుతున్నారు. అన్నాడీఎంకేలో 60మంది  ఎమ్మెల్యేలు  కొత్తగా ఎన్నికైనవారు  కావడంతో… వారికి  భవిష్యత్ భయం  పట్టుకుందని వార్తలొస్తున్నాయి. నిన్న ఎమ్మెల్యేలంతా  రాజ్ భవన్ కు  వెళ్తున్న టైమ్ లో  వారి కార్లపై  జనం ఉమ్మేసి, బూతులు  తిట్టడం కూడా  వారి భయానికి  కారణంగా కనిపిస్తోంది. మరోవైపు  అసంతృప్తులను  బుజ్జగించే పనిలో పడింది…AIDMK.  పార్టీలోని కీలక  నేతగా ఉన్న సెంగొట్టియన్ కు  అసెంబ్లీ  ఫ్లోర్ లీడర్ గా  పదవి కేటాయించారు  సీఎం పళనిసామి.

మరోవైపు రేపటి  బలపరీక్షలో ప్రతిపక్ష DMK  పాల్గొనడంలేదు. పళనిసామి  ప్రభుత్వానికి  పాలించే హక్కులేదంటున్నారు  DMK నేతలు. ప్రజలు  ఎన్నికలు కోరుకుంటున్నారని  DMK ఎంపీ కనిమొళి చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy