శశికళ అరెస్ట్ లో హైడ్రామా

sasi hidramaఅక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో శశికళ లొంగిపోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే రిసార్ట్ కు చేరుకున్నారు. భారీగా పోలీస్ బలగాలను కూడా మోహరించారు. ఇప్పటి వరకు చిన్నమ్మను అదుపులోకి తీసుకోలేదు. ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. తక్షణమే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తుంటే.. లొంగిపోయేందుకు గడువు ఇవ్వాలని శశికళ కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా నాలుగు వారాల గడువు కోరుతుంది. లాయర్లతో చర్చిస్తుంది. సుప్రీంకోర్టు కాపీ ఇంకా అందలేదని.. వచ్చిన తర్వాత కోర్టును అప్రోచ్ అవుతామని శశికళ తరపు లాయర్లు చెబుతున్నారు.

పోలీసుల డైలమా

ఇప్పటికే రిసార్ట్ చేసుకున్న పోలీస్ బలగాలు సాయంత్రం ఆరు గంటల తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. రాత్రికి చెన్నైలోనే ఉంచి.. రేపు కర్నాటక కోర్టులో హాజరుపరిచే విధంగా ప్రణాళిక రచించారు. మరోవైపు శశికళ వ్యక్తిగత సిబ్బందిని తొలగించారు. పోయెస్ గార్డెన్ దగ్గర సెక్యూరిటీ క్యాంప్ ను ఎత్తివేశారు. అన్నిదూరులు మూసేశారు.

One Response to శశికళ అరెస్ట్ లో హైడ్రామా

  1. Hi,
    Thanks for sharing updates on Tamil nadu politics.Recently most people all over indian very seriously watching and enjoying tamil nadu politics.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy