శశికళ ఎమ్మెల్యేలను పట్టుకురండి : హైకోర్టు

madras-high-courtఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కనపడకపోవడంపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను స్వీకరించాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు సీఎం పీఠం కోసం సాగుతున్న పోరులో ఎమ్మెల్యేలు ఎవరి పక్షాన నిలుస్తారో తెలియని ఉత్కంఠ.. ఇప్పుడు అందరిలోను నెలకొంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే చీఫ్ సెక్రటరీ శశికళ మధ్య ఎవరు సీఎం అనేది తేలాలిన ఈ సమయంలో ఎమ్మెల్యేలు కననపడకపోవడంపై ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తర్వాత కనిపించకపోవడంపై ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు తీవ్ర  ఆందోళన చెందుతున్నారు. వెంటనే తమ వారు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలని పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ ను స్వీకరించిన మద్రాస్ హైకోర్టు వెంటనే ఎమ్మెల్యేల జాడ కనుక్కోవాలని వస్తున్న ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

మరోవైపు పన్నీర్ సెల్వం క్యాంప్ లోని ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా తమ వాయిస్ ను మరింత పెంచారు. అమ్మ ఎంపిక చేసిన వ్యక్తి పన్నీర్ సెల్వమని.. ఆయనే సీఎం కావాలనదే తమ అందరి అభిమతమని కుండబద్దలు కొట్టారు. తమిళ ప్రజలకు ఏది మంచో అదే చేస్తామన్నారు.

One Response to శశికళ ఎమ్మెల్యేలను పట్టుకురండి : హైకోర్టు

  1. Anonymous says:

    Related news

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy