శశికళ టీమ్ కు షాక్.. దినకరన్ పై వేటు

ttv-dinakaranఅన్నాడీఎంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  ఆ పార్టీ డీప్యూటీ సెక్రటరీ జనరల్‌గా దినకరన్‌ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ తీర్మానం చేశారు. దీంతో అన్నాడీఎంకేలో శశికళ టీమ్ కు ఎండ్ కార్డు వేసినట్టేనంటున్నారు తమిళ నేతలు. అన్నాడీఎంకేలో కీలకంగా ఉన్న ఈపీఎస్‌-ఓపీఎస్‌ వర్గాల విలీనానికి రంగం సిద్ధమవుతున్న సమయంలో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన దినకరన్‌ మళ్లీ అలజడి రేపారు. అన్నాడీఎంకే పార్టీ శశికళదేనని, ఆమె స్థానంలో తానే పార్టీ అధినేతనంటూ ప్రకటనలు ఇచ్చారు. ఆయనకు పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకుంటానని దినకరన్‌ చేసిన ప్రకటనలు ఈపీఎస్‌-ఓపీఎస్‌ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ క్రమంలోనే దినకరన్‌పై వేటు వేస్తూ ఈపీఎస్‌ వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈపీఎస్‌-ఓపీఎస్ వర్గాల విలీనానికి మార్గం సుగమం అయినట్టు భావిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy