శశికళ, దినకర్ లను సస్పెండ్ చేసిన పన్నీర్

sasikala-dinakaranతమిళనాడులో రాజకీయాల్లో హై డ్రామా కంటిన్యూ అవుతోంది. అన్నా డీఎంకేలో వర్గ పోరుకు ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సీఎంగా పళనిసామి ప్రమాణ స్వీకారం తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు పన్నీర్ సెల్వం. ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు.

పార్టీలో శశికళ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన నేత మధుసూధనన్. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. శశికళ బంధువులు దినకరన్, వెంకటేష్ ను పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేశారు. శశికళ జైలుకు వెళ్లే ముందు పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ ను నియమించారు శశికళ. ఇన్నేళ్ల నుంచి పార్టీలో లేని పదవిని సృష్టించి మరీ… పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. తాను జైల్లో ఉన్న సమయంలో పార్టీపై పట్టుకోల్పోకుండా ఈ స్టెప్ తీసుకున్నారు శశికళ. అయితే… ఆ పదవి నుంచి దినకరన్ ను, శశికళ మరో సమీప బంధువు వెంకటేష్ ను సస్పెండ్ చేశారు మధుసూధనన్.

ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ 2011లో పార్టీ నుంచి శశికళ బంధువులు 12 మందిని జయలలిత సస్పెండ్ చేశారు. జయలలిత చనిపోయిన తర్వాత దినకరన్, వెంకటేష్ ను పార్టీలో చేర్చుకున్నారు శశికళ. తమదే అసలైన అన్నాడీఎంకే అంటూ చెప్పుకుంటున్న పన్నీర్ సెల్వం వర్గం… ఆ ఇద్దరు నేతలను పదవుల నుంచి తప్పించినట్టు ప్రకటించింది.

మరోవైపు రేపు అసెంబ్లీలో బలపరీక్ష ఉండడంతో… భవిష్యత్ కార్యాచరణపై వ్యూహరచన చేస్తున్నారు సీఎం పళనిసామి. గోల్డెన్ బే రిసార్ట్ కు చేరుకున్న ఆయన.. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. కీలక సమయంలో పార్టీలోని ఎమ్మెల్యేలు చేజారకుండా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగినట్టు ప్రచారం జరుగుతోంది.  అసమ్మతి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చర్చిస్తున్నట్టు సమాచారం. సీఎం పళని సామి కూడా అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy