శశికళ భర్త నటరాజన్ కన్నుమూత

Sasikala-natarajanఅన్నాడీఎంకే మాజీ నేత శశికళ భర్త ఎం. నటరాజన్‌(73) కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటరాజన్‌ గ్లోబల్‌ ఆసుపత్రిలో చేరారు. మూత్రపిండాల వ్యాధితో చికిత్స పొందుతూ మంగళవారం(మార్చి-20) రాత్రి 1.30కి తుదిశ్వాస విడిచారు. చెన్నై బీసెంట్‌ నగర్‌లోని నివాసానికి నటరాజన్‌ భైతికకాయంను తరలించారు. అయితే జైలులో ఉన్న శశికళకు పెరోల్‌ మంజూరు కానుంది. ఇవాళ (మంగళవారం,మార్చి-20) ఉదయం 11 గంటల వరకు భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.

గతంలో నటరాజన్‌ ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే డీఎంకేలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. హిందీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలితకు కొన్నాళ్ల పాటు రాజకీయ సలహాదారుగానూ వ్యవహరించారు. 1975లో నటరాజన్‌ శశికళను వివాహం చేసుకున్నారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసేందుకు శశికళ సోమవారం(మార్చి-19) పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy