శశికళ వర్గం సీఎం అభ్యర్థి పళనిస్వామి

palani swamyఎట్టి ప‌రిస్థితుల్లో ప‌న్నీర్ సెల్వం ముఖ్య‌మంత్రి కాకూడ‌ద‌ని శ‌శిక‌ళ పావులు క‌దుపుతోంది. ఎమ్మెల్యేలంతా క‌లిసి ఉండాల‌ని ఆమె సూచించారు. సీఎం అభ్య‌ర్థి రేసులో సెంగొట్టియాన్, ప‌ళ‌నిస్వామి పేర్లు ప్ర‌ధానంగా  విన‌ప‌డ్డాయి. అయితే  సీఎం అభ్య‌ర్థిగా ర‌హ‌దారులు, ఓడ‌రేవుల మంత్రి ప‌ళ‌నిస్వామి వైపే శ‌శి వ‌ర్గం మొగ్గు చూపింది. సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని ప్రతిపాదించింది శశికళ. జైలుకు వెళ్లటం ఖాయం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నది చిన్నమ్మ. సేలం జిల్లా ఎడప్పాడి నుంచి పళనిస్వామి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1991, 2011, 2016లో నాలుగుసార్లు అన్నాడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పరిపాలనపై పట్టున్న నేతగా గుర్తింపు ఉంది.

తమకు 129 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పిన పళని స్వామి వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తన బలాన్ని నిరూపించుకుంటానని పళనిస్వామి చెప్పారు. సీఎల్పీ లీడర్ గా ఎన్నికయ్యానని.. ఎమ్మెల్యేల మద్దతు నాకే ఉందంటూ మీడియాకు లేఖ చూపించారు. కాసేపట్లో గవర్నర్ ను పళని స్వామి బృందం కలవనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy