శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ విడుదల

Samsung-Galaxy-On7-Prime-Latestశాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్‌ ను తాజాగా విడుదల చేసింది. ఇందులో ముందు, వెనుక భాగాల్లో 13 మెగాపిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పవర్‌ఫుల్ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్రత్యేకంగా స్లాట్ ఇచ్చారు.

హోమ్ బటన్ కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. శాంసంగ్ పే మినీ యాప్‌ను ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. దీంతో యూజర్లు ఆన్‌లైన్‌లో సులభంగా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ 3/4 GB ర్యామ్, 32/64 GB స్టోరేజ్ వేరియెంట్లలో రూ.12,990, రూ.14,990 ధరలకు లభిస్తున్నది. ఈ ఫోన్‌ను అమెజాన్ సైట్‌లో ఈ నెల 20వ తేదీ నుంచి యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై జియో రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. దీన్ని జియో మనీ యాప్‌లో వాడుకోవచ్చు.

 ఫీచర్లు…

*5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
*1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

*1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

*3/4 జీబీ ర్యామ్, 32/64 GB స్టోరేజ్

*256 GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

*ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్

*డ్యుయల్ సిమ్

*13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు

*4G VOLTE , ఫింగర్‌ప్రింట్ సెన్సార్

*బ్లూటూత్ 4.1

* 3300 MAH  బ్యాటరీ

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy