శాంసంగ్ గెలాక్సీ నోట్ 9: అతిపెద్ద డిస్‌ప్లే

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్..తాజాగా గెలాక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది దక్షిణకొరియా దిగ్గజం శామ్‌సంగ్‌. గురువారం(ఆగస్టు-9) రాత్రి ఈ ఫోన్‌ విడుదలైంది. నోట్‌ సిరీస్‌లో ఇప్పటివరకు ఉన్న మోడళ్ల కంటే అతిపెద్ద బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే కలిగి ఉండటం నోట్‌ 9 స్పెషాల్టీ. అంతేకాదు అదిరిపోయే ఫీచర్లను అందించింది.

మిడ్‌నైట్‌ బ్లాక్‌, మెటాలిక్‌ కాపర్‌, ఓషియన్‌ బ్లూ, లావెండర్‌ పర్పుల్‌ రంగుల్లో నోట్‌ 9ను తయారుచేశారు. ఫోన్‌ రంగులకు మ్యాచ్‌ అయ్యే రంగుల్లోనే ఎస్‌ పెన్‌(స్టైలస్‌) కూడా ఉంటుంది. అమెరికా మార్కెట్లో నోట్‌ 9 ప్రారంభ ధర 999డాలర్లుగా ఉంది. 6GB ర్యామ్‌, 128GBస్టోరేజ్‌ వేరియంట్‌ ధర 999డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 68,700), 8GB ర్యామ్‌, 512GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1,250డాలర్లు(దాదాపు రూ. 85,900)గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు..

…6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
… 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
… ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక‌్టకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్
…6/8 GB ర్యామ్‌, 128/512 GB స్టోరేజ్‌
… 512 GB ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
…సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
… 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌
… డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌
… ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌
… ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ
…డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ
… 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy