శాతకర్ణికి ప్రశంసల జల్లు

satakarniసాహో బసవతారకరామ పుత్ర బాలయ్య అంటూ బాలయ్యపై ప్రశంసలు కురింపించాడు బాహుబలి రాజమౌళి. శాతకర్ణి బెనిఫిట్ షోను బాలయ్య, క్రిష్ తో కలిసి చూశారు. మీకు సెల్యూట్ చేస్తున్నాను.. శాతకర్ణి లాంటి చారిత్రాత్మక చిత్రంతో నందమూరి తారకరామారావు గారిని గుర్తు చేసారు. ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయన్నారు రాజమౌళి. ఇక అంజనాపుత్ర క్రిష్ నీకు 12 కోట్ల మంది తెలుగు ప్రజల దీవెనలు ఉంటాయని ట్విట్ చేశారు. నీ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఓ మహాకావ్యాన్ని 79 రోజుల్లో పూర్తి చేయడం నమ్మలేకపోతున్నాను అన్నారు. సాయిమాధవ్ రాసిన డైలాగ్స్ అద్బుతం అన్నారు. కెమెరా పనితనం అద్భుతంగా ఉందన్నారు. తెలుగు ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం అవుతుందని కీర్తించారు రాజమౌళి.

బాలయ్య కెరీర్ లో ఈ చిత్రం ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. బాబాయ్ సినిమా హిట్ కావాలని ఎన్టీఆర్ విషెస్ చెప్పారు. శాతకర్ణి సినిమాను మాటల్లో వర్ణించలేం అంటూ మంచు విష్ణు, మంచు మనోజ్‌, నాని ట్వీట్లు పెట్టారు. పెద్ద సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నానని సీనియర్ నటి హేమమాలిని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.

వర్మ కూడా ఆకాశానికెత్తేశాడు. హండ్రెడ్ చీర్స్ అంటూ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణలకు సెల్యూట్ చేశాడు ఆర్జీవీ. తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచిందన్నారు.

ఒక్క టికెట్ లక్ష రూపాయలు

బాలయ్య వందో చిత్రాన్ని చూసేందుకు అభిమానులు థియేటర్స్ దగ్గర బారులు తీరారు. కటౌట్స్, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. బాలయ్య అభిమాని గోపిచంద్ అనే వ్యక్తి బసవతారకం ఆస్పత్రికి విరాళంగా లక్షా వంద రూపాయలతో టికెట్ కోనుగోలు చేసి బాలయ్యపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy