శాప విమోచనం అయ్యిందా : 400 ఏళ్ల తర్వాత ఆ గుడిలోకి మగాళ్లు

aniఒడిశాలోని ఓ పురాతన ఆలయంలో అరుదైన ఘటన జరిగింది. సాంప్రదాయాలను పక్కన పెట్టి మొదటిసారిగా పురుషులను గుడిలోకి అనుమతించారు. కేంద్రపర జిల్లాలోని ఈ గుడిలోకి 400 ఏళ్లుగా పురుషులకు ప్రవేశం లేదు. అలాంటిది తొలిసారిగా పురుషులకు ప్రవేశం కల్సించడంతో ఇప్పుడు ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
కేంద్రపార జిల్లాలో సతాభ్యా అనే లంక గ్రామంలో ఉన్న పంచువారాహి అమ్మవారి ఆలయంలో మగవాళ్లకు అనుమతి లేదు. పెళ్లి అయిన ఐదుగురు దళిత మహిళలు మాత్రమే నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓ వైపు బంగాళా ఖాతంలో నీటి మట్టం పెరిగిపోతుండటం.. దాని ఒడ్డున్న ఉన్న గ్రామాలకు కూడా ముంపు ముప్పు ఉండటంతో గ్రామాల తరలింపు కార్యక్రమాన్ని ఒడిశా ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా సతాభ్యా గ్రామాన్ని బాగాపాటియా ప్రాంతానికి తరలించారు. అయితే తమను రక్షిస్తూ వస్తున్న అమ్మవారిని విగ్రహాలను తరలించేందుకు నిర్ణయించారు. ఆ విగ్రహాల తరలింపు ఆ మహిళా పూజారులకు కష్టమవడంతో ఐదుగురు పురుషుల సాయంతో ఏప్రిల్‌ 20న పడవ ద్వారా విగ్రహాలను కొత్త ఆలయానికి తరలించారు. 400 ఏళ్లుగా ఉన్న అచారం బ్రేక్ కావటంతో.. శాప విమోచనం అయ్యిందా అని ప్రజలు చర్చించుకోవటం జరిగింది.

sak

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy