శామ్ సంగ్ మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు

New-Samsung-Galaxy-Grand-Neo

Galaxy-Note-3-Neo-Won-t-Arrive-in-the-UK-Samsung-Confirms
శామ్ సంగ్ మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ నోట్ 3 నియో స్మార్ట్‌ఫోన్‌ను, రెండు ట్యాబ్లెట్‌లు- గెలాక్సీ ట్యాబ్ 3 నియో, నోట్ ప్రోలను శామ్‌సంగ్ మొబైల్ అండ్ ఐటీ ఇండియా హెడ్ వినీత్ తనేజా ఆవిష్కరించారు.వీటితో పాటు డిజిటల్ ఇమేజింగ్ కేటగిరీలో రెండు కొత్త ఉత్పత్తులు-ఎన్‌ఎక్స్30 (20.3 మెగా పిక్సెల్), గెలాక్సీ కెమెరా2(16.3 మెగా పిక్సెల్)లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. గెలాక్సీ నోట్ 3 నియో ధర 40,990 కాగా, గ్రాండ్ నియో ధర 18,450. నోట్ 3నియో కూడా ఎస్ పెన్ స్టైల్ లోనే ఉండబోతోంది. అంతేకాక నోట్ 3 నియో హెక్సా కోర్ ప్రొసెసర్ (dual-core 1.7GHz Cortex A15 + quad-core 1.3GHz Cortex A7) తో రానుంది. 5.5-inch HD (720×1280 pixels) Super AMOLED display; 2GB of RAM; 16GB inbuilt storage, and a 3100mAh battery తో గెలాక్సీ నోట్ 3 నియో అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. మార్చి మొదటి వారం నుండి భారత్ లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. మరో స్మార్ట్ ఫోన్ గ్రాండ్ నియో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy